సక్సెస్ఫుల్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ నుంచి మరింత సరసమైన మోడల్‌గా బజాజ్ చేతక్ 3001 ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీని ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ రూ. 99,990గా ఉంది. ఇది చేతక్ సిరీస్‌లో కొత్త ఎంట్రీ-పాయింట్ మోడల్‌గా మారింది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే పట్టణ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం దీనికి ఉంది.
ఈ లాంచ్‌తో, బజాజ్ అత్యంత పోటీతత్వ విభాగంలో టీవీఎస్, ఏథర్, విడా, హోండా వంటి ప్రసిద్ధ కంపెనీలతో పాటు త్వరలో విడుదల కానున్న సుజుకీ ఎలక్ట్రిక్ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోటీదారులతో పోల్చితే బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ సమయం, ఫీచర్లు, ధర పరంగా చేతక్ 3001 ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్ చేతక్ 3001 ఈ-స్కూటర్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎంట్రీ-లెవల్ 2.2కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌కు, పెద్ద 3.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌లకు మధ్యలో ఉంటుంది. ఇది 127 కి.మీ. ఐడీసీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఏథర్ రిజ్టా ఎస్ (2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 123 కి.మీ. రేంజ్) ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే కొద్దిగా ఎక్కువ! అయితే విడా వీ2 ప్లస్ (143 కి.మీ.), టీవీఎస్ ఐక్యూబ్ 3.5 (145 కి.మీ.) కంటే కొద్దిగా తక్కువ.
రాబోయే సుజుకీ ఈ-యాక్సెస్ (3kకేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ, తక్కువ ఎనర్జీ-డెన్స్ ఎల్ఎఫ్సీ సెల్స్ కారణంగా 95 కి.మీ.ల రేంజ్ మాత్రమే అందిస్తుంది)తో పోలిస్తే చేతక్ 3001 ఈ-స్కూటర్ మెరుగ్గా ఉంది. హోండా క్యూసీ1 దాని చిన్న 1.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో, 80 కి.మీ.ల రేంజ్‌తో గణనీయంగా వెనుకబడి ఉంది. అయినప్పటికీ దీని ధర తక్కువ.
చేతక్ 3001తో పాటు 750డబ్ల్యూ ఛార్జర్ వస్తుంది. ఇది 0 నుంచి 80 శాతం వరకు 3 గంటల 50 నిమిషాల్లో ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనప్పటికీ, దాని ఛార్జింగ్ సమయం అనేక ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌ల కంటే వేగంగా ఉంది! ఉదాహరణకు, ఏథర్ రిజ్టా ఎస్.. దాని స్టాండర్డ్ ఛార్జర్‌తో 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. అయితే, ఏథర్- విడా మోడల్స్ ఏథర్ గ్రిడ్ ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో అనుకూలతను కలిగి ఉండటం వల్ల ప్రయాణాలలో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ 2.2కేడబ్ల్యూహెచ్ అత్యంత వేగవంతమైన ప్రామాణిక ఛార్జింగ్ సమయంతో (2 గంటల 45 నిమిషాలు) అగ్రస్థానంలో ఉంది. అయితే 3.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్, సుజుకీ ఈ-యాక్సెస్ రెండింటి ఛార్జింగ్‌కి సుమారు 4 గంటల 30 నిమిషాలు అవసరం. ఆసక్తికరంగా, సుజుకీ తన రాబోయే ఫాస్ట్-ఛార్జర్ సెటప్‌లో కేవలం 1 గంట 12 నిమిషాల ఛార్జింగ్‌ను వాగ్దానం చేస్తోంది. ఇది భవిష్యత్తులో దానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
రూ. 99,990 ధరతో, బజాజ్ చేతక్ 3001 సరసమైన ధరలో లభిస్తోంది. కొన్ని పోటీదారుల కంటే తక్కువ ధరను కలిగి ఉంది. కొన్నింటి కంటే ఎక్కువ విలువను అందిస్తుంది. విడా వీ2 ప్లస్ రూ. 85,300 డిస్కౌంటెడ్ ధరతో ముందున్నప్పటికీ, ఈ ధర తక్కువ సమయం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. హోండా క్యూసీ1, రూ. 90,000 వద్ద సరసమైనది అయినప్పటికీ, రేంజ్, బ్యాటరీ పరిమాణంలో వెనుకబడుతుంది.
అధిక ధరల విభాగంలో, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 వేరియంట్ రూ. 1.31 లక్షల వద్ద ఉంది. ఏథర్ రిజ్టా ఎస్ రూ. 1.10 లక్షల వద్ద ఉంది - ఏథర్ ప్రో ప్యాక్‌కు అదనంగా రూ. 14,000 మినహాయించి, ఇది కీలక లక్షణాలను అన్‌లాక్ చేస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 రూ. 1 లక్ష వద్ద ఉంది, ఇది ధర పరంగా చేతక్‌కు దగ్గరగా ఉంది.
సంబంధిత కథనం