Ayushman Bharat card : రూ. 5లక్షలు ఉచిత వైద్యం ఇచ్చే ఈ స్కీమ్​ గురించి తెలుసా?-ayushman bharat card know eligibility terms and conditions in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ayushman Bharat Card : రూ. 5లక్షలు ఉచిత వైద్యం ఇచ్చే ఈ స్కీమ్​ గురించి తెలుసా?

Ayushman Bharat card : రూ. 5లక్షలు ఉచిత వైద్యం ఇచ్చే ఈ స్కీమ్​ గురించి తెలుసా?

Sharath Chitturi HT Telugu
Jun 29, 2024 11:26 AM IST

Ayushman Bharat card eligibility : ఆయుష్మాన్​ భారత్​ కార్డు ఉంటే.. ప్రతి యేటా రూ. 5లక్షల వరకు హాస్పిటల్​ ఖర్చుల కవరేజ్​ వస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రూ. 5లక్షల ఉచిత వైద్యం ఇచ్చే ఈ స్కీమ్​ గురించి తెలుసా?
రూ. 5లక్షల ఉచిత వైద్యం ఇచ్చే ఈ స్కీమ్​ గురించి తెలుసా?

ఈ మధ్య కాలంలో హాస్పిటల్​ బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. చికిత్సకు ముందే ప్రజలు గుండెలు పట్టుకుంటున్నారు. అయితే.. రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం, హాస్పిటల్​ ఖర్చులు ఇచ్చే ఒక కేంద్ర పథకం ఉంది. అదే.. ఆయుష్మాన్​ భారత్ ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య​ యోజన్​. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆయుష్మాన్​ భారత్​ కార్డుతో.. ఏటా రూ. 5లక్షల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఈ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు, నియమాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాము..

ఆయుష్మాన్​ భారత్ ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య​ యోజన్..

లాంచ్​ డేట్​:- 2018 సెప్టెంబర్​ 23

కవరేజ్​:- ఏడాదికి రూ. 5 లక్షలు

ప్రీ-హాస్పిటలైజేషన్​ ఎక్స్​పెన్స్​ కవరేజ్​:- 3 రోజుల వరకు

పోస్ట్​ హాస్పిటలై​జేషన్​ ఎక్స్​పెన్స్​ కవరేజ్​:- 15 రోజుల వరకు

వెబ్​సైట్​:- https://pmjay.gov.in/

ఫోన్​ నెంబర్​:- 1800-111-565 లేదా 14555

మీ ఎలిజిబిలిటీని ఆన్​లైన్​లో ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- ఆయుష్మాన్​ భారత్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కనిపించే 'Am I eligible' సెక్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- మీ మొబైల్​ నెంబర్​ ఎంటర్​ చేసి, క్యాప్చా కోడ్​ ఇవ్వండి. జెనరేట్​ ఓటీపీ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- ఓటీపీని ఎంటర్​ చేసి, వెరిఫై ఓటీపీ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 5:- మీ పేరు, వయస్సు, కుటుంబసభ్యులు, రాష్ట్రం, ఆదాయం వంటి వివరాలను ఫిల్​ చేయండి.

స్టెప్​ 1:- సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

ఆయుష్మాన్​ భారత కార్డు- ఎవరు పొందొచ్చు?

గ్రామీణ భారతం-

 • ఎస్​సీ, ఎస్​టీలు
 • బిక్షాటన చేస్తూ జీవితాలను గడిపేవారు
 • 16-59ఏళ్ల మధ్యలో కుటుంబసభ్యులు లేని వారు
 • కనీసం ఒక దివ్యాంగుడు ఉన్న కుటుంబాలు
 • కూలీ పని చేస్తూ, భూమి లేని కార్మికులు
 • గుడిసేల్లో జీవించే వారు
 • చెత్త ఏరుకుంటూ జీవించే వారు.

నగరాల్లో-

 • వాచ్​మెన్​లు, దోభీలు
 • చెత్త ఏరుకుని జీవించే వారు
 • మెకానిక్​లు, ఎలక్ట్రీషియన్లు, రీపేర్​ వర్కర్లు
 • పని మనుషులు
 • పారిశుద్ధ్య కార్మికులు, గార్డెనర్లు, స్వీపర్లు
 • హాండీక్రాఫ్ట్​ వర్కర్లు, టైలర్లు
 • చెప్పులు కుట్టే వారు సహా రోడ్డు మీద సాధారణ పనులు చేసేవారు
 • ప్లంబర్లు, మేసన్​లు, నిర్మాణ కార్మికులు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు
 • డ్రైవర్లు, కండక్టర్లు, రిక్షా నడిపేవారు
 • చిన్న సంస్థల్లోని ప్యూన్​లు, అసిస్టెంట్​లు, డెలివరీ బాయ్​లు, దుకాణదారులు, వెయిటర్లు.

ఆయుష్మాన్​ భారత్​ కార్డు- అర్హత, టర్మ్స్​ అండ్​ కంటీషన్స్​..

ఈ కింద వాటిల్లో ఒకటి ఉన్నా.. ఆయుష్మాన్​ భారత్​ కార్డు లభించదు. అవి..

2,3, 4 వీలర్​- ఫిషింగ్​ బోట్​

రూ. 50వేలు క్రెడిట్​ లిమిట్​ ఉండే కిసాన్​ కార్డు

ప్రభుత్వ ఉద్యోగులు

ప్రభుత్వ ఆధారిత వ్యవసాయేతర సంస్థలు

నెలకు రూ. 10వేలు, అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారు

పక్కా ఇళ్లల్లో నివాసముంటున్నవారు.

5 ఎకరాలు అంతకన్నా ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు.

అందుకే.. ఈ ఆయుష్మాన్​ భారత ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య యోజన్​ అందరికి ఉపయోగపడదు. బడుగుబలహీన వర్గాలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందొచ్చు. ఇలాంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైతే అవసరం ఉందో, వారికి ఈ సమాచారం షేర్​ చేయండి.

ఇంకో విషయం! ఇప్పుడు హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. పర్సనల్​ ఫైనాన్స్​కి సంబంధించిన లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

WhatsApp channel

సంబంధిత కథనం