Awfis Space IPO: రెండో రోజే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన ‘ఆఫీస్ స్పేస్’ ఐపీఓ.. జీఎంపీ కూడా ఆకర్షణీయంగానే..-awfis space ipo oversubscribed on day 2 led by retail investors details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Awfis Space Ipo: రెండో రోజే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన ‘ఆఫీస్ స్పేస్’ ఐపీఓ.. జీఎంపీ కూడా ఆకర్షణీయంగానే..

Awfis Space IPO: రెండో రోజే ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన ‘ఆఫీస్ స్పేస్’ ఐపీఓ.. జీఎంపీ కూడా ఆకర్షణీయంగానే..

HT Telugu Desk HT Telugu
May 23, 2024 02:24 PM IST

Awfis Space IPO: ఆఫీస్ స్పేస్ ఐపీఓ (Awfis Space IPO) కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బిడ్డింగ్ కోసం ఓపెన్ అయిన రెండో రోజే ఈ ఐపీఓ ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ రంగంలో ‘అఫీస్ స్పేస్’ కంపెనీ మార్కెట్ లీడర్ గా ఉంది. గత రెండేళ్ల ఆర్థిక ఫలితాలు కూడా బావున్నాయి.

ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ వివరాలు
ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ వివరాలు (https://www.awfis.com/)

Awfis Space IPO: అఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ (Awfis Space Solutions IPO) మే 22, బుధవారం ప్రారంభమైంది. బిడ్డింగ్ ప్రక్రియలో రెండో రోజు ఈ ఐపీఓకు రిటైలర్ల నుంచి మంచి స్పందన లభించింది. బీఎస్ఈ డేటా ప్రకారం మే 23 మధ్యాహ్నం 1:03 గంటలకు అఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్ 3.26 రెట్లుగా ఉంది.

yearly horoscope entry point

రిటైల్ రంగం నుంచి మంచి స్పందన

ఈ అఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓకు రిటైల్ విభాగం 9.78 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 4.74 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ పార్ట్ కు 31% సబ్ స్క్రిప్షన్ లభించింది. ఉద్యోగి వాటా 5.66 రెట్లు బుక్ అయింది. ఈ ఐపీఓ(IPO) లోని 86,29,670 షేర్లకు గానూ, 2,80,91,661 షేర్లకు బిడ్లు వచ్చాయని బీఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐపీఓకు బిడ్డింగ్ ప్రారంభమైన తొలి రోజు మే 22న రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ కేటగిరీ 6.02 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీ 2.76 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. అఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ మే 27 సోమవారంతో ముగుస్తుంది.

అఫీస్ స్పేస్ సొల్యూషన్స్ వివరాలు..

అఫీస్ స్పేస్ సొల్యూషన్స్ అనేది ఒక కో-వర్కింగ్ స్పేస్ ఆపరేటర్. ఈ సంస్థ స్టార్టప్ లు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, పెద్ద సంస్థలు, బహుళజాతి సంస్థలకు ఆఫీస్ స్పేస్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఆయా సంస్థలకు వ్యక్తిగత ఫ్లెక్సిబుల్ డెస్క్ అవసరాల నుండి పూర్తి స్థాయి కార్యాలయ స్థలాల వరకు విస్తృత శ్రేణి ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ పరిష్కారాలను అందిస్తుంది. సంస్థ ప్రమోటర్లలో పీక్ ఎక్స్ వి, ప్రమోటర్ సెల్లింగ్ షేర్ హోల్డర్, వ్యక్తిగత ప్రమోటర్ అమిత్ రమణి ఉన్నారు. మే 14 నాటికి ప్రమోటర్లు 27,444,403 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 268 కోట్లు..

ఈ సంస్థ 32 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.383 గరిష్ట ధర శ్రేణితో రూ.268.61 కోట్లను సమీకరించింది. ఆ ఇన్వెస్టర్లలో వోల్రాడో వెంచర్ పార్ట్నర్స్ ఫండ్, హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫండ్, అలియాంజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫండ్, గోల్డ్మన్ శాక్స్ ఫండ్స్, నాటిక్సిస్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఐపీఓ లో 10% రీటైల్ ఇన్వెస్టర్లకు, 15% నాన్ ఇన్ స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 75% ఆఫర్ ను బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) రిజర్వ్ చేశారు. ఎంప్లాయీ రిజర్వ్ విభాగంలో ఉద్యోగులకు రూ. 36 డిస్కౌంట్ లో గరిష్ఠంగా రూ.2 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు.

ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ రివ్యూ

ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ కేటగిరీలో ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ మార్కెట్ లీడర్ గా ఉంది. ఇది భారతదేశంలోని ఐదు బెంచ్మార్క్ సంస్థలలో మొదటి స్థానంలో ఉందని రాజన్ షిండే అనే రీసెర్చ్ అనలిస్ట్ పేర్కొన్నారు. 2026 నాటికి మొత్తం ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ మార్కెట్ 282 మిలియన్ చదరపు అడుగులకు, లేదా రూ.474-592 బిలియన్లకు చేరుకుంటుందని షిండే అంచనా వేశారు. 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో ఆపరేషనల్ రెవెన్యూ 44 శాతం, 112 శాతం పెరగ్గా, నష్టాలు రూ.57.16 కోట్ల నుంచి రూ.46.63 కోట్లకు తగ్గాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వ్యాపారం నికర నగదు సానుకూల స్థితిని సాధిస్తుందని యాజమాన్యం చెబుతోంది.

ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ జీఎంపీ

ఆఫీస్ స్పేస్ ఐపీఓకు గ్రే మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. మే 23 న ఈ ఐపీఓ జీఎంపీ (GMP) +122గా ఉంది. గ్రే మార్కెట్లో అఫిస్ స్పేస్ సొల్యూషన్స్ షేరు ధర రూ.122 ప్రీమియం వద్ద ట్రేడవుతోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవే తప్ప హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు చెందినవి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Whats_app_banner