Triumph Scrambler 1200 X : ఇండియాలో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ లాంచ్- ధర ఎంతంటే..
Triumph Scrambler 1200 X launched in India : ఇండియాలో.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200ఎక్స్ బైక్ లాంచ్ అయ్యింది. ఈ బైక్ ఫీచర్స్, ధర వివరాలు మీకోసం..
Triumph Scrambler 1200 X price in India : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సంస్థ.. ఇండియాలో ఓ కొత్త లగ్జరీ బైక్‌ని లాంచ్ చేసింది. దీని పేరు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్. ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్..
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌లో 1,200 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హెచ్‌పీ పవర్‌ని, 110 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. బైక్‌లోని ట్యూబ్‌లెస్ టైర్స్ కోసం సరికొత్త క్రాస్- స్పోక్డ్ రిమ్స్ వస్తున్నాయి.
Triumph Scrambler 1200 X : ఈ లగ్జరీ బైక్ సీట్ హైట్ 820ఎంఎం. దీనిని 795 ఎంఎంకి తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంది. రేర్ ప్రీలోడ్ అడ్జెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇందులో యాక్సియల్లీ మౌంటెడ్ నిస్సిన్ కాలిపర్స్‌తో కూడిన బ్రేకింగ్ సిస్టెమ్ వస్తోంది.
ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌లో 5 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి.. రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్, రైడర్ కాన్ఫిగరెబుల్. ఈ బైక్‌లో ఐఎంయూతో కూడిన ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Tata Punch on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Triumph Scrambler 1200 X India launch : ఈ బైక్‌లోని రౌండ్ డాష్.. ట్రయంఫ్ 660 సీసీ బైక్స్‌ని గుర్తు చేస్తోంది. ఇందులో టర్న్ బై టర్న్ నేవిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్స్ వంటివి ఆప్షనల్‌గా ఇస్తోంది సంస్థ. అంతేకాకుండా.. ఈ స్క్రాంబ్లర్ ఎక్స్‌కి 70 అఫీషియల్ యాక్సెసరీస్‌ని కూడా ఇస్తోంది ట్రయంఫ్.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్- ధర ఎంతంటే..
ఇండియాలో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 11.83 లక్షలు. ముందు మోడల్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్‌సీ కన్నా ఇది రూ. 1.10 లక్షలు అధికం!
Triumph Scrambler 1200 X price : మంచి లగ్జరీ బైక్ కొనాలని భావించే వారికి.. ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ కొత్త ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సంప్రదించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం