Auto sales in August: ఆగస్ట్ నెలలో మారుతి, మహింద్ర అమ్మకాల జోరు; సేల్స్ తగ్గిన టాటా మోటార్స్-auto sales for august 2023 here is how indian auto majors performed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Auto Sales In August: ఆగస్ట్ నెలలో మారుతి, మహింద్ర అమ్మకాల జోరు; సేల్స్ తగ్గిన టాటా మోటార్స్

Auto sales in August: ఆగస్ట్ నెలలో మారుతి, మహింద్ర అమ్మకాల జోరు; సేల్స్ తగ్గిన టాటా మోటార్స్

HT Telugu Desk HT Telugu
Sep 02, 2023 02:56 PM IST

Auto sales in August: ఆగస్ట్ నెలలో వివిధ సంస్థల, వివిధ కేటగిరీల వాహనాల అమ్మకాలు మిశ్రమంగా కొనసాగాయి. ప్యాసెంజర్ కార్ల విభాగంలో మారుతి సుజుకీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Auto sales in August: ఆగస్ట్ నెలలో భారత్ లో వాహనాల అమ్మకాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్యాసెంజర్ కార్ల కేటగిరీలో గత సంవత్సరం ఆగస్ట్ తో పోలిస్తే, మారుతి సుజుకీ 16.4% వృద్ధిని, మహింద్ర అండ్ మహింద్ర 19% వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఆగస్ట్ నెలలో మారుతి సుజుకీ మొత్తం 1,65,402 యూనిట్ల కార్లను అమ్మగలిగింది.

ఎస్యూవీల్లో మహింద్ర..

ఈ ఆగస్ట్ నెలలో మొత్తం 70,350 యూనిట్ల కార్లను అమ్మగలిగామని మహింద్ర అండ్ మహింద్ర ప్రకటించింది. ఎగుమతుల్లోనూ మంచి ఫలితాలను సాధించామని తెలిపింది. తమ కార్ సేల్స్ లో ఎస్ యూవీలదే ప్రధాన పాత్ర అని, ఈ ఆగస్ట్ నెలలో భారత్ లో మొత్తం 37,270 ఎస్ యూవీలను, ఎగుమతులను కలుపుకుని 38,164 యూనిట్లను అమ్మామని వెల్లడించింది. ఇది 26% వృద్ధి అని తెలిపింది. దేశీయంగా 23,613 యూనిట్ల కమర్షియల్ వాహానాలను అమ్మామని తెలిపింది.

టాటా మోటార్స్ సేల్స్

ఈ ఆగస్ట్ నెలలో టాటా మోటార్స్ సేల్స్ దాదాపు 3.5% వరకు తగ్గాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు కలుపుకుని ఈ ఆగస్ట్ నెలలో టాటా మోటార్స్ 78,010 వాహనాలను అమ్మగలిగింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో టాటామోటార్స్ వాహానల సేల్స్ 78,843 యూనిట్లు. మరోవైపు, ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ మోటార్స్ అత్యధికంగా 5% వృద్ధిని నమోదు చేసింది. బజాజ్ ఆటో ద్విచక్ర వాహనాల సేల్స్ అనూహ్యంగా, అత్యధికంగా 31% తగ్గాయి. ఐషర్ మోటార్స్ ద్విచక్ర వాహనాల సేల్స్ 11% పెరిగాయి. టీవీఎస్ మోటార్స్ 2022 ఆగస్ట్ లో 333,787 యూనిట్లను అమ్మగా, 2023 ఆగస్ట్ లో 345,848 యూనిట్ల బైక్స్ అండ్ స్కూటర్స్ ను అమ్మగలిగింది.