VinFast India : 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దిగ్గజ అంతర్జాతీయ సంస్థ.. డిజైన్ హైలైట్!
VinFast Bharat mobility expo : ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్.. ఇండియాలో అడుగుపెట్టింది. ఆటో ఎక్స్పో2025లో రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌కి ఉన్న సూపర్ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు సైతం పోటీపడుతున్నాయి. ఇందులో భాగాంగానే మరో అంతర్జాతీయ సంస్థ తాజాగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 12కుపైగా దేశాల్లో వాహనాలను విక్రయిస్తున్న విన్‌ఫాస్ట్.. దిల్లీ వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2025లో రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. ఈ మోడల్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు..
విన్‌ఫాస్ట్ తన ఫ్లాగ్షిప్ వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో తాజాగా ఆవిష్కరించింది. వీఎఫ్6 , వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు రెండూ.. ఎయిరోప్లేన్ ఇన్స్పైర్డ్ డిజైన్‌ను పొందుతాయి. కాక్‌పిట్ లాంటి క్యాబిన్ని ఇవి కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో మూన్రూఫ్ని కూడా తయారీదారు అందిస్తున్నారు.
విన్‌ఫాస్ట్ వీఎఫ్6: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న విన్‌ఫాస్ట్ వీఎఫ్6 మోడల్ని ఎకో వర్షెన్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఈ వేరియంట్ గరిష్టంగా 171బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లస్ వర్షెన్‌లో ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 381 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఇది 198 బీహెచ్పీ పవర్, 309 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ కోసం 12.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ లభిస్తుంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఈవెంట్లో ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ఒక హైలైట్! ఇది కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసే మొదటి ప్రాడక్ట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. విన్‌ఫాస్ట్ వీఎఫ్7 అనేది ఆల్-ఎలక్ట్రిక్ ఫైవ్-సీటర్ ఎస్యూవీ. ఇది 75.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది. పూర్తి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని తెలుస్తోంది. విన్‌ఫాస్ట్ వీఎఫ్7 సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ లేదా డ్యూయెల్ మోటార్ సెటప్ వేరియంట్లలో లభిస్తుంది.
సింగిల్-మోటార్ వేరియంట్ ముందు చక్రాలకు పవర్‌ని ఇస్తుంది. ఇది 201 బీహెచ్పీ పవర్‌ని, 310 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
మరోవైపు డ్యూయల్ మోటార్ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను పొందుతుంది. ఈ రెండు మోటార్లు మొత్తంగా 348 బీహెచ్పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎస్యూవీ రెండు వేరియంట్లలో, బ్యాటరీ ప్యాక్ ఒకేలా ఉంటుంది. సింగిల్ ఛార్జ్ రేంజ్ 450 కిలోమీటర్లు (సింగిల్ మోటార్) నుంచి 431 కిలోమీటర్లు (డ్యూయల్ మోటార్) వరకు ఉంటుంది. సింగిల్ మోటార్ లో 12.9 ఇంచ్ టచ్‌స్క్రీన్, డ్యూయల్ మోటార్ వేరియంట్లో 15 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, లెవల్-2 ఏడీఏఎస్ సూట్‌ను కలిగి ఉంది.
ఇండియాలో విన్‌ఫాస్ట్ కార్యకలాపాల గురించి, లాంచ్ అయ్యే మోడల్స్ గురించి రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం