సింగిల్ ఛార్జ్‌తో 95 కి.మీ రేంజ్- మిడిల్ క్లాస్ ప్రజలు మెచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది..
Suzuki e-Access : మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. సుజుకీ ఈ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ తాజాగా రివీల్ చేసింది. ఈ మోడల్ రేంజ్, బ్యాటరీతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది! సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా.. ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్పో 2025లో కొత్త ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించింది. ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటైన సుజుకీ యాక్సెస్ 125 సీసీ పెట్రోల్ స్కూటర్‌కి ఇది ఈవీ వర్షెన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. సరళమైన స్టైలింగ్, ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లతో కుటుంబ కొనుగోలుదారును ఈ ఈ-స్కూటర్ లక్ష్యంగా చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో హోండా యాక్టివా, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 వంటి వాటికి కొత్త సుజుకీ ఈ-యాక్సెస్ గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ స్కూటర్లో ఎకో, రైడ్ ‘ఏ’, రైడ్ 'బి' అనే మూడు రైడింగ్ మోడ్లతో పాటు రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2/ మెటాలిక్ మ్యాట్ బోర్డెక్స్ రెడ్, పెర్ల్ గ్రేస్ వైట్/ మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ జేడ్ గ్రీన్/ మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే అనే మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ-యాక్సెస్ అందుబాటులోకి రానుంది.
సుజుకీ ఈ-యాక్సెస్ స్పెసిఫికేషన్లు..
రాబోయే సుజుకీ ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.07 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల (ఐడీసీ) రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులోని 4.1 కిలోవాట్ల (5.4 బీహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్ 15 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లకు పరిమితమైంది. బ్యాటరీ 0-80 శాతం నుంచి ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. 240 వాట్ల పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేయడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఛార్జింగ్ సమయాన్ని 1 గంట 12 నిమిషాలు (0-80 శాతం), 2 గంటల 12 నిమిషాలు (0-100 శాతం) కు తగ్గిస్తుంది.
సుజుకీ ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ తరహా సస్పెన్షన్‌ని కలిగి ఉంది. ఈ స్కూటర్ ముందు భాగంలో 90/90 సెక్షన్ టైర్, వెనుక భాగంలో 100/80-సెక్షన్ టైర్‌తో రెండు వైపులా 12-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో నడుస్తుంది. బ్రేకింగ్ పనితీరు ఫ్రంట్ డిస్క్, రేర్ డ్రమ్ సెటప్ నుంచి వస్తుంది.
డైమెన్షన్స్ పరంగా, ఈ-యాక్సెస్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,880 ఎంఎం పొడవు, 715 ఎంఎం వెడల్పు, 1,140 ఎంఎం ఎత్తు, 1,305 ఎంఎం పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం, సీటు ఎత్తు 765 ఎంఎం. దీని బరువు 122 కిలోలు.
ఇతర ఫీచర్లలో ఎల్ఈడీ డీఆర్ఎల్తో ఆల్-ఎల్ఈడీ లైటింగ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్, డ్యూయల్ ఫ్రంట్ పాకెట్లు, 24.4 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ కన్సోల్ సహా మరిన్ని ఉన్నాయి. సుజుకీ ఈ ఏడాది చివరిలో కొత్త ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకురానుంది.
సంబంధిత కథనం