ఫెర్రాటో డీఫై 22.. సింగిల్ ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల రేంజ్‌లో స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటీ
Ferrato Defy 22 Electric Scooter : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025లో అనేక ఎలక్ట్రిక్ వాహనాలు ప్రదర్శనకు వచ్చాయి. ఓపీజీ మొబిలిటీ (గతంలో ఓకియా ఈవీ) కూడా కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసింది.
ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మోడళ్లు ప్రదర్శనలో ఉన్నాయి. ఓపీజీ మొబిలిటీ కూడా కొత్త ఈవీని తీసుకొచ్చింది. కంపెనీ మోస్ట్ అవైటెడ్ ఫెర్రాటో డీఫై 22ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. జనవరి 17, 2025 నుండి డీఫై 22 కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త స్కూటర్ 7 బెస్ట్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ferrato defy 22 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది కాంబి డిస్క్ బ్రేక్ సిస్టమ్ ను కలిగి ఉంది.
సింగిల్ ఛార్జ్‌తో 80 కిలో మీటర్లు
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది కాకుండా గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఇది ఐపీ67-రేటెడ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ, వెదర్ ప్రూఫ్ ఐపీ65-రేటెడ్ ఛార్జర్‌ను కలిగి ఉంది. మ్యూజిక్ ఫీచర్, స్పీడోమీటర్, స్టైలిష్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో కూడిన 7 అంగుళాల టచ్ డిస్ ప్లే ఉంటుంది. దీని డిజైన్ క్లాసీగా కనిపిస్తుంది.
ఏడు కలర్ ఆప్షన్స్
ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ల ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో 1200 వాట్ల పవర్ మోటార్, 2500 వాట్ల గరిష్ట శక్తిని పొందుతుంది. స్టైలిష్ డిజైన్ తో డీఫై 22ను 7 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. షాంపైన్ క్రీమ్, బ్లాక్ ఫైర్, కోస్టల్ ఐవరీ, యూనిటీ వైట్, రెసిలెంట్ బ్లాక్, డోవ్ గ్రే, మ్యాట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. వీటితో పాటు కాన్సెప్ట్ మోడల్ ఫెర్రాటో జెడ్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది.
ఫెర్రాటో డీఫై 22 విడుదల గురించి కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. భారతీయులకు రోజువారీ ప్రయాణ అనుభవాన్ని అందించే ఈ స్టైలిష్ స్కూటర్ ను లాంచ్ చేయడానికి సంతోషిస్తున్నామని తెలిపింది.