Auction for sale of government securities: ప్రభుత్వ సెక్యూరిటీల వేలం-auction for sale re issue of government securities here s what you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Auction For Sale (Re-issue) Of Government Securities: Here's What You Need To Know

Auction for sale of government securities: ప్రభుత్వ సెక్యూరిటీల వేలం

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 10:13 PM IST

Auction for sale of government securities: ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మకానికి పెట్టిన సెక్యూరిటీల్లో 5% అర్హులైన వ్యక్తులు, సంస్థలకు కేటాయించింది.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం
కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం

ప్రభుత్వ సెక్యూరిటీల వేలం(Re-issue)పై కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. గవర్న్మెంట్ సెక్యూరిటీల వేలం నిర్వహించాలని నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

Auction for sale of government securities: 5% వారికే..

అమ్మకానికి పెట్టిన సెక్యూరిటీల్లో 5% అర్హులైన వ్యక్తులు, సంస్థలకు నాన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రకారం కేటాయించనున్నట్లు వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India RBI) నిర్ధారించిన ‘సెంట్రల్ గవర్న్ మెంట్ సెక్యూరిటీస్’ గైడ్ లైన్స్ ప్రకారం సెక్యూరిటీల వేలం, అలాట్ మెంట్ ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం..

  • వీటిలో ఏకీకృత ధరల విధానం (uniform price method) ద్వారా రూ. 7 వేల కోట్ల విలువైన సెక్యూరిటీల (7.38% Government Security 2027) వేలం ఉంటుంది.
  • రూ. 12 వేల కోట్ల విలువైన సెక్యూరిటీల(7.26% Government Security 2032) వేలం ఏకీకృత ధరల విధానం (uniform price method) ద్వారా ఉంటుంది.
  • రూ. 9 వేల కోట్ల విలువైన సెక్యూరిటీల(7.36% Government Security 2052) వేలం బహుళ ధరల విధానం (multiple price method) ద్వారా ఉంటుంది.
  • పైన పేర్కొన్న సెక్యూరిటీల్లో, ఒక్కో విభాగంలో రూ. 2 వేల కోట్ల వరకు అదనంగా, వేలం వేసే విషయమై కేంద్రం సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది.
  • ఈ వేలాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India), ముంబై శాఖ నిర్వహిస్తుంది.
  • ఈ వేలం డిసెంబర్ 30, 2022న జరుగుతుంది.
  • కాంపిటీటివ్, అలాగే, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ ను ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో డిసెంబర్ 30 న ‘ఈ కుబేర్’ కు(Reserve Bank of India Core Banking Solution system) పంపించాల్సి ఉంటుంది.
  • నాన్ కాంపిటీటివ్ బిడ్స్ ను డిసెంబర్ 30 ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గంటల మధ్య సబ్మిట్ చేయాలి. అలాగే, కాంపిటీటివ్ బిడ్స్ ను డిసెంబర్ 30 ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య సబ్మిట్ చేయాలి.
  • వేలం ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. అర్హులైన బిడ్డర్లు జనవరి 2, 2023నచెల్లింపు జరపాల్సి ఉంటుంది.

WhatsApp channel