Stock Market Investors : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం చాలా ముఖ్యం.. టాప్ కంపెనీల క్యూ3 ఫలితాలు రాబోతున్నాయి
Stock Market Investors : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం చాలా కీలకంగా ఉండనుంది. ఎందుకంటే టాప్ కంపెనీల క్యూ3 ఫలితాలు రాబోతున్నాయి. మంగళవారం నుంచి శనివారం వరకు క్యూ3 ఫలితాలు ప్రకటించే కంపెనీల లిస్ట్ చూద్దాం..
ఇండియాలోని ప్రముఖ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో వంటి ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు గత వారం తమ ఫలితాలను విడుదల చేశాయి.

భారత స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 10 కంపెనీలు గత వారం ట్రేడింగ్‌లోనే దాదాపు రూ.1,71,680 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. టాప్ 10లో రిలయన్స్, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ మాత్రమే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగాయి. ఈ వారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న టాప్ కంపెనీల లిస్ట్ చూద్దాం..
జనవరి 21 మంగళవారం
ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, దాల్మియా భారత్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండ్ బ్యాంక్ హౌసింగ్, ఇండియా సిమెంట్స్, ఇండోకో రెమెడీస్, పి.ఎన్.బి. హౌసింగ్ ఫైనాన్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, టాటా టెక్నాలజీస్, యూకో బ్యాంక్ సహా 32 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రచురించబోతున్నాయి.
జనవరి 22 బుధవారం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనివర్సల్(హెచ్‌యుఎల్), బీపీసీఎల్, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, హెరిటేజ్ ఫుడ్స్, హట్ కో, ఇండోసోలార్, బిడ్‌లైట్ ఇండస్ట్రీస్, టాటా కమ్యూనికేషన్స్‌తో సహా 47 కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాయి.
గురువారం జనవరి 23
అదానీ గ్రీన్ ఎనర్జీ, అల్ట్రాటెక్ సిమెంట్, సైయెంట్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఇండస్ టవర్స్, కె.ఎఫ్.ఐ.ఎన్. టెక్నాలజీస్, మ్యాన్‌కైండ్ ఫార్మా, ఎంఫసిస్, ఇతర 51 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి.
జనవరి 24 శుక్రవారం
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏయూ. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంక్, గోద్రెజ్ కన్స్యూమర్, డీఎల్‌ఎఫ్, ట్రైడెంట్, టొరెంట్ ఫార్మా సహా 66 కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రచురించేందుకు రెడీగా ఉన్నాయి.
జనవరి 25 శనివారం
ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, జేకే సిమెంట్ సహా 13 కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి.
ఈ ఆర్థిక ఫలితాలు భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల ఆర్థిక స్థితిగతుల గురించి పెట్టుబడిదారులకు, మార్కెట్ విశ్లేషకులకు ఎంతో కీలకం కానున్నాయి. తాజాగా జొమాటో క్యూ3 రిజల్ట్స్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను జొమాటో జనవరి 20న ప్రటించింది. నికర లాభం 57.3 శాతం క్షీణించి రూ.59 కోట్లకు చేరుకుంది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.