Batmobile sale : ‘బ్యాట్‌మొబైల్’లో రయ్రయ్ అంటూ దూసుకెళ్లాలా? ఇది మీకోసమే..
డార్క్ నైట్ ట్రయాలజీలో బ్యాట్‌మాన్ ఉపయోగించిన బ్యాట్‌మొబైల్ గుర్తుందా? దీని రెప్లికా ఇప్పుడు సేల్‌లోకి వచ్చింది. ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది డార్క్ నైట్ ట్రయాలజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ సినిమాల్లో వినియోగించిన ఆయుధాలు, వాహనాలు చూసి చాలా మంది వావ్! అనుకున్నారు. బ్యాట్మొబైల్తో బ్యాట్‌మాన్ చేసిన విన్యాసాలకు ఫిదా అయిపోయిన వారిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! బ్యాట్‌మొబైల్ తొలిసారి సేల్‌లోకి వచ్చింది. 10 మంది అదృష్టవంతులే దీన్ని దక్కించుకోగలరు. ఈ నేపథ్యంలో ఈ బ్యాట్‌మొబైల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాట్‌మొబైల్ సేల్..
ఇది ఒరిజినల్ కాదు! ఇదొక రెప్లికా. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అండ్ ఇంటర్నేషనల్ ఇటీవలే టంబ్లర్ బ్యాట్‌మొబైల్ అధికారికంగా పూర్తి-పరిమాణ ప్రతిరూపాన్ని అమ్మకానికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీన్ని వీధుల్లో నడిపేందుకు అనుమతులు ఉండవు కానీ ఇది ఫుల్లీ ఫంక్షనల్! యాక్షన్ వెహికల్ ఇంజనీరింగ్ నిర్మించిన ఈ కారు కేవలం 10 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటి ధర 2.99 మిలియన్ డాలర్లు!
టంబ్లర్ బ్యాట్‌మొబైల్ రెప్లికా బుగాటి చెరాన్ వలె ఖరీదైనది! ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్పైడర్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కానీ ఈ రెప్లికా కూడా సినిమాటిక్, ఆటోమోటివ్ హిస్టరీలో ఒక భాగం.
వేన్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్పీరియన్స్ లగ్జరీ బ్రాండ్ ఎకోసిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా లభించే టంబ్లర్ బ్యాట్‌మొబైల్ ప్రతి యూనిట్ కస్టమ్-బిల్ట్ ఇంటీరియర్లను కలిగి ఉంటుంది. కస్టమైజెబుల్ ఆప్షన్స్‌తో పాటు ప్రత్యేక సంఖ్యను కలిగి ఉంటుంది.
బ్యాట్‌మొబైల్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. దీని బరువు సుమారు 2,500 కిలోలు! నాలుగు చక్రాలకు పవర్ డిస్క్ బ్రేకులు లభించగా, హుడ్ కింద 6.2-లీటర్ ఇంజిన్ 517బీహెచ్పీ పవర్, 658ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. జెట్-ఫ్లేమ్ సిమ్యులేషన్ కూడా ఉన్నప్పటికీ ఎటువంటి మంటలు లేకుండా ప్యాడల్ షిఫ్టర్లతో కూడిన జీఎమ్ 4ఎల్ 85ఈ ట్రాన్స్మిషన్ కూడా చేర్చడం జరిగింది.
లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్లో మాత్రమే లభించే టంబ్లర్ బ్యాట్‌మొబైల్‌లో డిజిటల్-పెర్ఫార్మెన్స్ డ్యాష్ బోర్డ్, ఎయిర్ కండిషనింగ్, ఐదు పాయింట్ల రేస్-కార్ సీట్లు కూడా ఉన్నాయి.
సినిమాల్లో చూపించిన మాదిరిగానే, టంబ్లర్ బ్యాట్‌మొబైల్ రెండు సీట్ల వెహికిల్. ఇది ఫ్లాప్ యాక్చువేటర్లు, వన్-వే మిర్రర్డ్ గ్లాస్ స్క్రీన్లతో నిండి ఉంటుంది.
క్లియర్‌గా చాలా ఖరీదైనది, సూపర్ ఎక్స్‌క్లూజివ్ అయినప్పటికీ, టంబ్లర్ బ్యాట్‌మొబైల్ పూర్తిస్థాయి రెప్లికా ఒక కలెక్షన్ ఐటెమ్‌గా మీ గ్యారేజ్‌లో పెట్టుకోవచ్చు!
సంబంధిత కథనం
టాపిక్