Electric scooter : 110 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త ఫీచర్స్..
Ather 450X : అథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు కొత్త కలర్ స్కీమ్లను పొందుతాయి. ఇందులో కొత్త ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.
ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోటీని తట్టుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేయడమే కాదు అప్పటికే తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాటిని అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఏథర్ ఎనర్జీ తన బెస్ట్ సెల్లింగ్ 450 సిరీస్‌ని రెండు కొత్త కలర్ ఆప్షన్స్‌తో అప్డేట్ చేసేందుకు రెడీ అవుతోంది. డార్క్ నేవీ బ్లూ, యెల్లో కలర్ స్కీమ్లను ఈ స్కూటర్స్‌కి ప్రవేశపెట్టనుంది. కొత్త కలర్ స్కీమ్స్.. మరో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా నుంచి స్ఫూర్తిని పొందినట్లు కనిపిస్తోంది. కలర్ ఆప్షన్సతో పాటు మ్యాజిక్ ట్విస్ట్ సహా మరిన్ని కొత్త ఫీచర్స్‌ని ఈ స్కూటర్లో తీసుకొస్తోంది ఏథర్ సంస్థ.
ఈ సమాచారాన్ని కోయంబత్తూరు ఏథర్ ఓనర్స్ వెల్లడించింది. కొత్త రంగులు, ఫీచర్లతో కూడిన ఏథర్ 450 సిరీస్ జనవరి 2025 లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్రాండ్ తన ట్రాక్ అటాక్ ఈవెంట్ కోసం కూడా సన్నాహాలు చేస్తోంది. ఇందులో 450ఎక్స్‌తో పాటు 160 సీసీ మోటార్ సైకిల్, 125 సీసీ ఐసీఈ ఆధారిత స్కూటర్ని సంస్థ ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. జనవరి 4న ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నారు.
ఈ ఏథర్ 450ఎక్స్‌లోని 2.9 కేడబ్ల్యూ బ్యాటరీని ఛార్జ్ చేస్తే సుమారు 110 కి.మీల రేంజ్ ఇస్తుంది.
ఏథర్ ఎనర్జీ ఐపీఓ..
ఏథర్ ఎనర్జీకి సంబంధించి మరో కీలక అప్డేట్ కూడా ఉంది. ఏథర్ ఎనర్జీ ఐపీఓకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఆమోదం లభించింది. వివిధ రంగాలకు చెందిన మరో ఆరు కంపెనీలతో కలిసి ఏథర్ ప్రతిపాదనకు రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం తెలిపింది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రతిపాదిత ఐపీఓతో రూ.3,100 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి తీసుకురానుంది. అంతేకాకుండా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లో పెట్టనుంది. ఓఎఫ్ఎస్లో పాల్గొనే సంస్థల్లో కాలాడియం ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2, 3 స్టేట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్, ఐఐటీఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఉన్నాయి.
మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన మూలధన వ్యయాలకు, అలాగే పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ ప్రయత్నాలు, రుణ చెల్లింపులలో పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు కొత్త ఇష్యూ ద్వారా సమకూరిన నిధులతో కేటాయిస్తారు.
ఆగస్టులో రూ .6,145 కోట్ల ఐపీఓతో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడుమార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటున్న రెండొవ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఈ ఏథర్.
ఏథర్ ఎనర్జీ అంకితభావం కలిగిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ. ఇది భారతదేశంలో తన అన్ని ఉత్పత్తులను స్క్రాచ్ నుంచి అభివృద్ధి చేస్తుంది. 2013 లో స్థాపించిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం సమగ్ర పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి భారతదేశంలో ఉత్పత్తి, సాంకేతిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించింది.
సంబంధిత కథనం