Dell work from home : 'వర్క్​ ఫ్రం హోం చేస్తే.. ప్రమోషన్​ కట్​'- ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన డెల్​!-at dell those preferring to work from home will not be promoted ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  At Dell, Those Preferring To Work From Home Will Not Be Promoted

Dell work from home : 'వర్క్​ ఫ్రం హోం చేస్తే.. ప్రమోషన్​ కట్​'- ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన డెల్​!

Sharath Chitturi HT Telugu
Mar 18, 2024 02:47 PM IST

Dell latest news : డెల్​ ఉద్యోగులకు కఠిన రూల్స్​ తీసుకొచ్చింది సంస్థ! వర్క్​ ఫ్రం హోం చేయాలనుకుంటే.. ప్రమోషన్​ గురించి ఆలోచించకండని తేల్చిచెప్పింది.

ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన డెల్​!
ఉద్యోగులకు షాక్​ ఇచ్చిన డెల్​!

Dell work from home policy : దిగ్గజ టెక్​ సంస్థ డెల్​.. ఉద్యోగులకు షాక్​ ఇచ్చింది! ఫిబ్రవరి నెలలో కఠినమైన 'రిటర్న్​ టు వర్క్​' పాలసీని అమలు చేసిన డెల్​.. ఇప్పుడు వర్క్​ ఫ్రం హోం చేయాలనుకుంటే, ప్రమోషన్​ ఇవ్వమని తేల్చిచెప్పింది!

ట్రెండింగ్ వార్తలు

వర్క్​ ఫ్రం హోం చేస్తే.. ప్రమోషన్​ కట్​..!

వాస్తవానికి.. కొవిడ్​ కన్నా ముందు నుంచే.. డెల్​ టెక్నాలజీస్​లో హైబ్రీడ్​ వర్కింగ్​ కల్చర్​ ఉంది. అంటే.. కొన్ని రోజులు ఆఫీస్​కి వెళ్లాలి, ఇంకొన్ని రోజులు ఇంట్లో నుంచి వర్క్​ చేయొచ్చు. దశాబ్ద కాలం పాటు ఈ పాలసీ కొనసాగింది. కానీ ఇప్పుడు.. 'రిటర్న్​ టు ఆఫీస్​'ని సంస్థ చాలా సీరియస్​గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. వర్క్​ ఫ్రం హోం చేద్దామని అనుకుంటున్న ఉద్యోగులపై పట్ల కఠినంగా ఉండాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. మే నెల నుంచి.. ఉద్యోగులను 'హైబ్రీడ్​', 'రిమోట్​' కేటగిరీలుగా విభజించాలని సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదికను ప్రచురించింది.

Dell return to work policy : నివేదిక ప్రకారం.. హైబ్రీడ్​ కేటగిరీలో ఉన్న ఉద్యోగులు.. క్వార్టర్​కి 39 రోజులు / వారానికి 3 సార్లు ఆఫీస్​లో రిపోర్ట్​ చేయాలి. వర్క్​ ఫ్రం హోం కొనసాగించాలని అనుకుంటున్న ఉద్యోగులను ప్రమోషన్​ కోసం పరిగణించారు. అంతేకాదు.. బాధ్యతలను మార్చాలన్నా ఎంపిక చేయరు.

"రిమోట్​ టీమ్​ సభ్యులు ఒక విషయాన్ని అర్థం చసుకోవాలి. కెరీర్​లో ముందుకు వెళ్లాలన్నా, కంపెనీలో కొత్త రోల్​కి అప్లై చేయాలన్నా, మీరు హైబ్రీడ్​ కేటగిరీలోకి వెళ్లాల్సిందే," అని.. ఉద్యోగులకు సంస్థ లెటర్లు పంపించిందట!

ఈ కొత్త రూల్స్​తో డెల్​ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పైగా, చాలా మందికి ఈ రూల్స్​ నచ్చడం లేదని సమాచారం.

Work from home jobs in Hyderabad : కంపెనీలో 6,650 ఉద్యోగులను తొలగిస్తామని డెల్​ ప్రకటించింది. మార్కెట్​ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

‘వర్క్‌ ఫ్రం హోం’ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా..?

వర్క్​ ఫ్రం హోం చుట్టూ ఇటీవలి కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన నవ్యశ్రీ అనే యువతి ఇటీవల బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గత నెల 2న.. నవ్యశ్రీకి ఈ నెల 2వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ జాబ్‌ పేరుతో ఓ లింక్‌ను పంపించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం