Mutual fund SIP : పడుతూనే ఉన్న స్టాక్​ మార్కెట్​లు- స్మాల్​ క్యాప్​ ‘సిప్​’ ఆపేయాలా?-as small mid cap funds fall sharply is this the time to stop your sip ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Fund Sip : పడుతూనే ఉన్న స్టాక్​ మార్కెట్​లు- స్మాల్​ క్యాప్​ ‘సిప్​’ ఆపేయాలా?

Mutual fund SIP : పడుతూనే ఉన్న స్టాక్​ మార్కెట్​లు- స్మాల్​ క్యాప్​ ‘సిప్​’ ఆపేయాలా?

Sharath Chitturi HT Telugu
Updated Feb 17, 2025 01:24 PM IST

Mutual fund SIP : స్టాక్​ మార్కెట్​లో పతనంతో మీ స్మాల్​- మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కూడా డౌన్​లో ఉన్నాయి? మరి ఈ పెట్టుబడులను ఇప్పుడు ఆపేయాలా? లేక కొనసాగించాలా? ఈ విషయంపై ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే..

ఇప్పుడు స్మాల్​ క్యాప్​లో ‘సిప్​’ ఆపేయాలా?
ఇప్పుడు స్మాల్​ క్యాప్​లో ‘సిప్​’ ఆపేయాలా?

దేశీయ స్టాక్​ మార్కెట్​లు 2025లో భారీ పతనాన్ని చూస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​కి ముందు నిఫ్టీ50 ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ 7 శాతం, నిఫ్టీ స్మాల్​ క్యాప్ 250 ఇండెక్స్ 9 శాతం నష్టపోయాయి. ఇక సోమవారం కూడా నష్టాలు కొనసాగుతుండటంతో, ఈ నెంబర్​ ఇంకా పెరగొచ్చు. ఇంతటి పతనం దృష్ట్యా మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​ చుట్టూ మదుపర్లలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆయా ఫండ్స్​లో ఇప్పుడు సిప్​ (సిస్టెమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) ఆపేయాలా? లేక ఇంకా యాడ్​ చేయాలా? అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు మాట ఏంటంటే..

స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​లో సిప్​ ఆపేయాలా?

ఈ విషయంపై నిపుణులు సునిశితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అస్థిరంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల అధిక రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు మాత్రమే స్మాల్, మిడ్ క్యాప్ ఫంఢ్స్​లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు.

“రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్ కేటగిరీల్లో స్మాల్ క్యాప్స్ ప్రధానంగా ఉంటాయి. బేసిక్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే మిడ్ క్యాప్స్​లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీలు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఉద్దేశించినవని గుర్తుపెట్టుకోవాలి. ఎంత రిస్క్ తీసుకోగలము అన్నది ఇన్వెస్టర్లు విశ్లేషించిన తర్వాతే ఈ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి,” అని అప్నా ధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫౌండర్ ప్రీతి జెండే చెప్పారు.

స్మాల్​, మిడ్​ క్యాప్ మ్యూచువల్​ ఫండ్స్​లో​ కేటాయింపులు అనేవి పోర్ట్​ఫోలియోలో 30-40 శాతానికి మించకూడదని మరో నిపుణుడు నొక్కి చెప్పారు.

“మొత్తం పోర్ట్​ఫోలియోలో స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ వాటా 30-40శాతం మించకూడదు. అలా అని అసలు వీటిల్లో పెట్టుబడి పెట్టకపోవడం కూడా కరెక్ట్​ కాదు. స్మాల్​ క్యాప్​ వల్ల పోర్ట్​ఫోలియోలో ర్యాలీ కనిపిస్తుంది. అయితే, ఇన్వెస్ట్​మెంట్​ గోల్స్​ అనేవి 7,8ఏళ్లు (లాంగ్​ టర్మ్​ ప్లానింగ్​) ఉంటే ఈ తరహా ఫండ్స్​లో పెట్టుబడి మంచిది,” అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్, వెల్త్ లాడర్ డైరెక్ట్ వ్యవస్థాపకుడు శ్రీధరన్ ఎస్ చెప్పారు.

గత పనితీరు ఇలా..

వాస్తవానికి స్టాక్​ మార్కెట్​లో అప్​-డౌన్​ సైకిల్​ సర్వసాధారణం! స్మాల్​, మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గత పర్ఫార్మెన్స్​ చూస్తే.. కొన్ని సంవత్సరాలు నొప్పి తప్పదని, కానీ ఆ తర్వాత మంచి రిటర్నులు చూడవచ్చని మీరే గ్రహిస్తారు.

“2008లో మిడ్, స్మాల్ క్యాప్స్ 70 శాతం వరకు క్షీణించాయి. ఆ మరుసటి ఏడాది 70 శాతం పెరిగాయి! అలాగే, ఈ కేటగిరీ గత మూడేళ్లలో 100 శాతం వరకు సంపూర్ణ రాబడిని ఇచ్చింది. ఆ సమయంలో మీరు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు 20శాతం పడినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు,” అని శ్రీధరన్ చెప్పారు.

"గత బుల్ రన్​లో మిడ్, స్మాల్​క్యాప్​లు అద్భుతమైన రాబడులను అందించి, ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. కాబట్టి, ఇప్పుడు దిద్దుబాటు జరగాల్సి ఉంది" అని జెండే చెప్పారు.

స్మాల్​ క్యాప్​లో లంప్సమ్​ అమౌంట్​ పెడుతుంటే జాగ్రత్తగా ఉండాలని, రెగ్యులర్​గా సిప్​ చేస్తుంటే మాత్రం, పెద్దగా ఇబ్బంది పడకుండా వాటిని కొనసాగించవచ్చని ఇతర నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తగా ఉండండి..

“మిడ్​, స్మాల్​ క్యాప్​ల్లో ఒడిగొడుకులు చాలా ఉంటాయి. దీర్ఘకాలానికి ఇవి ఉత్తమం. పిల్లల చదువు కోసం, 10ఏళ్ల సుదీర్ఘ పెట్టుబడి ప్లాన్​తో, రిస్క్​ని తీసుకోగలిగే వారు ఈ తరహా ఫండ్స్​ని ఎంచుకోవచ్చు,” అని శ్రీధరన్​ వెల్లడించారు.

"మీరు దీర్ఘకాలం కోసం ఈ ఫండ్స్​లో పెట్టుబడి పెడుతుంటే, (మొత్తం పెట్టుబడుల్లో 20 నుంచి 25% వరకు) అప్పుడు మీరు మీ సిప్​లను కొనసాగించవచ్చు" అని జెండే చెప్పారు.

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడవైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం