వరికైనా ఎప్పుడైనా డబ్బు అవసరం రావచ్చు. ప్రతి వ్యక్తి అత్యవసర నిధిని ఉంచుకోవాలి కానీ అందరికీ కుదరదు. డబ్బు ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది బ్యాంకు నుండి వ్యక్తిగత రుణం కూడా తీసుకుంటారు. కానీ వ్యక్తిగత రుణం అత్యంత ఖరీదైన రుణాలలో ఒకటి.
ఈ రుణం వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకు నుండి వ్యక్తిగత రుణం తీసుకోవాలి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన యెస్ బ్యాంక్ వ్యక్తిగత రుణం గురించి తెలుసుకుందాం..
యెస్ బ్యాంక్ తన కస్టమర్లకు చాలా మంచి వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ బ్యాంకు వ్యక్తిగత రుణంపై ప్రారంభ వడ్డీ రేట్లు 11.25 శాతం నుండి మెుదలవుతాయి. ఈ వడ్డీ రేట్లు లోన్ మొత్తం, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మారవచ్చు.
యెస్ బ్యాంక్ నుండి 10 సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నారు అనుకుందాం. మీరు ఈ రుణాన్ని 11.25 శాతం వడ్డీ రేటుతో పొందినట్లయితే ప్రతి నెలా రూ. 13,917 ఈఎంఐగా చెల్లించాలి. ఈ విధంగా బ్యాంకుకు మొత్తం రూ.16,70,027 చెల్లిస్తారు. ఇందులో మీ వడ్డీగా రూ. 6,70,027గా ఉంటుంది.