Debt Free Life : అప్పు అవసరమే తీరుస్తుంది.. పరిష్కారాన్ని చూపదు.. 2025లో ఈ విషయాలు ఫాలో అవ్వండి-are you dreaming of debt free life then follow these tips from 2025 new year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Debt Free Life : అప్పు అవసరమే తీరుస్తుంది.. పరిష్కారాన్ని చూపదు.. 2025లో ఈ విషయాలు ఫాలో అవ్వండి

Debt Free Life : అప్పు అవసరమే తీరుస్తుంది.. పరిష్కారాన్ని చూపదు.. 2025లో ఈ విషయాలు ఫాలో అవ్వండి

Anand Sai HT Telugu
Dec 31, 2024 05:00 PM IST

Debt Free Life : అప్పు లేని వ్యక్తులు ఈ కాలంలో చాలా తక్కువ. ఎంత పెద్ద ధన వంతుడైనా బ్యాంకుల్లోనో.. చుట్టు పక్కల వారి దగ్గరో అప్పులు తీసుకుంటూనే ఉంటారు. కానీ 2025లో కూడా మీరు ఇదే పద్ధతి కొనసాగించకండి. కాస్త తెలివిగా ఆలోచించి అప్పులు లేని జీవితం గడపండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అప్పు తీసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. ఉదయం లేవగానే అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి నిలుచుంటాడు. లేదంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో ఛీ దీనమ్మా జీవితం అనిపిస్తుంది. లైఫ్‌లో అప్పులు తప్ప మరేమీ కనిపించవు. చాలా మంది జీవితంలో మితిమీరిన ఖర్చు, అనవసరమైన కొనుగోళ్లు, ప్రణాళిక లేని ఖర్చుల కారణంగా అప్పులు ఎక్కువ అవుతాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పక్కవారితో పోల్చుకుని అప్పులపాలయ్యే మధ్యతరగతివారు ఎందరో..

yearly horoscope entry point

చాలా మంది జీవితంలో నెల జీతం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఫంక్షన్లు, ఆరోగ్య సమస్యలు, షాపింగ్‌లు, సినిమాలు, షికార్లు.. ఇలా అనేక ఖర్చులతో అప్పులపాలు అయ్యేవారు అనేక మంది. ఆర్థిక నిర్వహణ తెలియ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కానీ మీరు తలుచుకుంటే 2025 ఒక్క ఏడాదిలోనే మీ ఆర్థిక పరిస్థితి మార్చుకోవచ్చు. ఇందుకోసం అప్పులను సరిగా నిర్వహించాలి. ఆదాయాన్ని, ఖర్చులను విశ్లేషించాలి. అప్పుల విషయంలో కొన్ని సూత్రాలు పాటించాలి.

మెుత్తం అప్పు లెక్కించే ముందు క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు, బిల్లులు మొదలైనవాటిని చూడండి. మిగిలిన బ్యాలెన్స్, వడ్డీ రేట్లు, ప్రతిదానికి కనీస నెలవారీ చెల్లింపులతో సహా మీ మొత్తం రుణాన్ని లెక్కించండి. సంపాదించిన మొత్తం ఆదాయం, నెలవారీ ఖర్చులతో పోల్చుకోండి. ఖర్చుల్లో ఎక్కడ సేవ్ చేయవచ్చో, ఎక్కడ తగ్గించవచ్చో గుర్తించండి. సినిమా ఖర్చులు, ఫ్యాన్సీ హోటల్ భోజనం, వినోదం.. కొన్ని అవసరమైన విషయాలను కంట్రోల్ చేయండి. పెట్రోల్ నుంచి పాన్ షాపు వెళ్లే విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. పొదుపు ఎందులో చేయాలో క్లారిటీ తెచ్చుకోండి.

ముందుగా చిన్న మొత్తంలో రుణాన్ని ఎంచుకుని అది పూర్తిగా చెల్లించే వరకు దానికి ఎక్కువ డబ్బును జోడించాలి. ఇది చిన్న అప్పులను త్వరగా తీర్చేలా చేస్తుంది. అప్పులు కట్టేస్తాంలేననే మానసిక బలాన్ని ఇస్తుంది.

ఒక రుణాన్ని చెల్లించడానికి కొత్త రుణాలను తీసుకోవడం మొదట ఆపేయాలి. చాలా మంది క్రెడిట్ కార్డు వాడి.. అప్పులను కడుతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఆదాయం పెంచుకునే మార్గాన్ని చూడాలి. పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరి బాగా సంపాదించుకోవచ్చు. పార్ట్‌టైమ్‌గా క్యాబ్ డ్రైవింగ్, ఫుడ్ డెలివరీలాంటి అనేక పనులు మీకు ఉపయోగపడతాయి. మీరు ఆఫీస్ వెళ్లి వస్తుంటే ఓలా, ర్యాపిడోలాంటి వాటి మీద సంపాదించుకోవచ్చు.

అప్పు, అరువు తీసుకోవడం, అనేది అవసరం మాత్రమే.. పరిష్కారం కాదు అని గుర్తుంచుకోవాలి. మీరు ఎంచుకున్న ఏదైనా రుణదాత నిబంధనలను అర్థం చేసుకోండి. చెల్లింపు సామర్థ్యాన్ని సరిపోల్చండి. అప్పుడే గట్టి నిర్ణయం తీసుకోండి. 2025లో మీరు అప్పుల నుంచి బయటపడాలంటే కచ్చితంగా మీరు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయం, ఖర్చులను ప్రతీ నెలా లెక్కలు వేసుకోవాలి. ఆదాయానికి మంచిన ఖర్చులు పెడితే జీవితంలో అప్పులు తీర్చలేరు.

Whats_app_banner