Archean Chemical IPO: ఈ IPO కి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా?-archean chemical ipo gmp subscription status on day 2 of the issue ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Archean Chemical Ipo: Gmp, Subscription Status On Day 2 Of The Issue

Archean Chemical IPO: ఈ IPO కి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా?

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 09:29 PM IST

Archean Chemical IPO: ఆర్కియన్ కెమికల్స్ ఐపీఓ కు మదుపర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ IPO కి అప్లై చేసుకోవడానికి శుక్రవారం లాస్ట్ డేట్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Archean Chemical IPO: బ్రొమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, సల్ఫేట్, తదితర స్పెషలైజ్డ్ మెరైన్ కెమికల్స్ ను ముఖ్యంగా గుజరాత్ తీరంలో ఈ ఆర్కియన్ కెమికల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Archean Chemical IPO: ఐపీఓ వివరాలు..

ప్రత్యేక మెరైన్ కెమికల్ ఉత్పత్తుల సంస్థ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ IPO కి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. IPO ఇష్యై కన్నా ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ. 658 కోట్లను సమకూర్చుకుంది.

  • నవంబర్ 9న ఈ IPO ప్రారంభమైంది. నవంబర్ 11 వరకు మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ IPO ప్రైస్ బ్యాండ్ ను రూ. 386 నుంచి రూ. 407 మధ్య నిర్ణయించారు.
  • ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో 36 షేర్లు ఉంటాయి.
  • రిటెయిల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో రెండో రోజైన నవంబర్ 10వ తేదీననే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయింది.
  • రూ. 805 కోట్ల విలువైన 1.61 కోట్ల ఈక్విటీ షర్లను ఈ ఐపీఓ ద్వారా అలాట్ చేయనున్నారు.
  • నవంబర్ 21న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.
  • యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకు రూ. 407 చొప్పున 1.61 కోట్ల షేర్లను నవంబర్ 7న సంస్థ అలాట్ చేసింది. దీని ద్వారా రూ. 658 కోట్లను సంస్థ సమకూర్చుకుంది.
  • యంకర్ ఇన్వెస్టింగ్ ద్వారా గోల్డ్మన్ సాచ్స్, బీఎన్పీ పారిబాస్, డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా మ్యుచ్యువల్ ఫండ్, ఎస్బీఐ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.
  • ఈ ఐపీఓ గురువారం గ్రే మార్కెట్లో రూ. 75 ప్రీమియంతో ట్రేడ్ అయింది.
  • ఈ ఐపీఓకు రిలయన్స్ సెక్యూరిటీస్ సబ్ స్క్రైబ్ ఆప్షన్ ను సిఫారసు చేసింది.

WhatsApp channel