Home loan : మీ హోం లోన్ అప్రూవ్ అవ్వాలంటే.. క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా?
Home loan credit score : హోం లోన్‌కి అప్లై చేస్తున్నారా? తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ రేట్లు పడతాయి. అసలు మీ లోన్ అప్రూవ్ అవ్వాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా?

మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ అర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రేట్ కట్ సైకిల్ని ప్రారంభించింది! ఇప్పుడు లోన్లు తక్కువ వడ్డీకే లభిస్తాయి. మరీ ముఖ్యంగా హోం లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ రేట్ కట్స్ చాలా రిలీఫ్‌ని ఇస్తాయి. వడ్డీ రేట్ల కోతతో హోం లోన్ ఈఎంల భారం తగ్గుతుంది. అయితే వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశం మరొకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదే.. క్రెడిట్ స్కోర్! మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే మీ హోం లోన్ని అప్రూవ్ అవ్వొచ్చు. సరైన క్రెడిట్ స్కోర్ లేకపోతే అసలు హోం లోన్ని బ్యాంకలు ఇవ్వకపోవచ్చు! మరి.. హోం లోన్ అప్రూవ్ అవ్వాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలంటే..
1. 750 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు : తక్కువ వడ్డీ రేట్లతో హోం లోన్ ఆమోదం పొందందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది.
II. 700 నుంచి 749 మధ్య: ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. కాని కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను చూడవచ్చు.
III. 650 నుంచి 699 మధ్య: ఆమోదం లభించొచ్చు, కానీ అధిక వడ్డీ రేట్లు- కఠినమైన నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
IV. 650 కంటే తక్కువ: ఆమోదం పొందడం కష్టమే! రుణం ప్రారంభంలో ఒక బ్యాంకు.. సహ దరఖాస్తుదారు లేదా అధిక డౌన్‌పేమెంట్‌ను కోరవచ్చు.
మీ హోం లోన్ అప్రూవల్ అవకాశాలను ఇలా పెంచుకోండి..
- మీ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి:
i) లేట్ పేమెంట్స్ మీ స్కోరును దెబ్బతీస్తాయి కాబట్టి మీరు ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి.
ii) క్రెడిట్ వినియోగాన్ని 30శాతం కంటే తక్కువగా ఉంచండి.
iii) ఎక్కువ లోన్ ఎంక్వైరీలు మీ స్కోరును తగ్గిస్తాయి. కాబట్టి ఒకేసారి బహుళ రుణాలకు దరఖాస్తు చేయకుండా ఉండండి.
iv) మీ సిబిల్ రిపోర్టును చెక్ చేయండి. తప్పులు ఏవైనా కనిపిస్తే అలర్ట్ అవ్వండి.
v) సెక్యూర్డ్ (హోమ్/ఆటో లోన్), అన్సెక్యూర్డ్ (క్రెడిట్ కార్డ్) క్రెడిట్ మిక్స్ సహాయపడుతుంది.
2.అధిక డౌన్‌పేమెంట్: బ్యాంకులు తక్కువ లోన్-టు-వాల్యూ నిష్పత్తులను అనుకూలంగా పరిగణిస్తాయి. అధిక డౌన్‌పేమెంట్ (10%కు బదులుగా 20-30%) చేయడం బెటర్.
3. జీవిత భాగస్వామితో దరఖాస్తు చేసుకోండి: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడితో మీరు దరఖాస్తు చేసినప్పుడు హోం లోన్ ఆమోదం అవకాశాలు మెరుగుపడతాయి.
4.దీర్ఘకాలిక రుణ కాలపరిమితి: మీరు ఎక్కువ కాలపరిమితిని ఎంచుకున్నప్పుడు, మీ ఈఎమ్ఐ తగ్గుతుంది. తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. అప్రూవల్ అవకాశాలను పెంచుతుంది.
5.స్థిరమైన ఆదాయాన్ని చూపించండి: బ్యాంకులు సాధారణంగా స్థిరమైన జాబ్ హిస్టరీ కలిగిన వేతన దరఖాస్తుదారులను లేదా క్రమం తప్పకుండా ఆదాయ రికార్డులు ఉన్న స్వయం ఉపాధి దరఖాస్తుదారులను ఇష్టపడతాయి. కాబట్టి శాలరీ స్లిప్పులు, ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందించాలి.
(గమనిక: లోన్ తీసుకోవడం రిస్క్ అని గుర్తుపెట్టుకోండి.)
సంబంధిత కథనం