కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో జరిగిన యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా టెక్ దిగ్గజం పలు కీలక, ఆసక్తికర ప్రకటనలు చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంటర్‌ఫేస్ “లిక్విడ్ గ్లాస్”, ఐఫోన్ కోసం ఐఓఎస్ 26 వంటి ప్రకటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌కి సంబంధించిన హైలైట్స్‌ని ఇక్కడ చూసేయండి..
లిక్విడ్ గ్లాస్ అనేది యాపిల్ సంస్థ తమ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లన్నిటికీ తీసుకొచ్చిన సరికొత్త డిజైన్ ఇంటర్‌ఫేస్. ఇది ఉపరితలంపై నిగనిగలాడే ట్రాన్స్పరెంట్ విజువల్స్‌ని కలిగి ఉంటుందని తెలిపారు.
యాపిల్ హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ఆలన్ డై ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ఈ రోజు మా డిజైన్‌కు ఒక ఉత్తేజకరమైన, అందమైన కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది మా ఉత్పత్తుల తదుపరి శకానికి రంగం సిద్ధం చేస్తుంది," అన్నారు.
"ఇది కాంతిని అందంగా వెనక్కి తీసుకుంటుంది. మీ కదలికలకు అద్భుతమైన హైలైట్స్‌తో డైనమిక్‌గా ప్రతిస్పందిస్తుంది," అని డై తెలిపారు. 2013లో iOS7 ప్రారంభించినప్పటి నుంచి టెక్ దిగ్గజం కోసం ఇది అతిపెద్ద సాఫ్ట్‌వేర్ డిజైన్ అని అన్నారు.
ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే తమ పరికరాల్లోని కస్టమ్ చిప్‌ల శక్తి పెరగడం వల్ల ఈ కొత్త సాఫ్ట్‌వేర్ సమూల మార్పు సాధ్యమైందని యాపిల్ చెబుతోంది.
యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిఘి మాట్లాడుతూ.. కొత్త 'లిక్విడ్ గ్లాస్' డిజైన్ ఐఫోన్‌లు, మ్యాక్‌లు, ఇతర యాపిల్ ఉత్పత్తుల ఆపరేటింగ్ సిస్టమ్‌లకు విస్తరిస్తుందని తెలిపారు. అంతేకాదు, టెక్ దిగ్గజం ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సంబంధించి.. ప్రతి వెర్షన్ సీక్వెన్షియల్ నంబర్‌లకు బదులుగా ఇప్పుడు సంవత్సరం పేర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.
యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025లో ప్రకటించిన ఈ చర్య.. ఫోన్‌లు, వాచీలు, ఇతర పరికరాల కోసం యాపిల్ ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌ల కారణంగా వినియోగదారులకు గందరగోళంగా మారిన నామకరణ సంప్రదాయాలను ఏకీకృతం చేస్తుందని నిర్ధారిస్తుంది.
"2026లో మాకు శక్తినిచ్చే రిలీజ్‌లను వెర్షన్ 26గా ఉంటాయి," అని ఆయన పేర్కొన్నారు. యాపిల్ అన్ని ఉత్పత్తుల రాబోయే తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్లు '26'తో ముగుస్తాయి. అంటే.. iOS 26, watchOS 26, macOS 26, visionOS 26, iPadOS 26, tvOS 26.
ఆ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఐఓఎస్ 26ని ఆవిష్కరించింది. ఇందులో స్మార్టర్ ఏఐ కేపబులిటీస్, ఎన్హాన్స్డ్ ప్రైవసీ కంట్రోల్స్, సిస్టెమ్- లెవల్ అప్డేట్స్ ఉంటాయి. రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటు ఈ ఫీచర్ల వల్ల ఐఫోన్ పర్ఫార్మెన్స్ మరింత వేగవంతమవుతుందని, భద్రత మరింత పెరుగుతుందని, యూజర్‌కి మరింత పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుందని సంస్థ చెప్పింది.
ప్రస్తుతం ఐఓఎస్ 26 బీటా వర్షెన్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి సాఫ్ట్‌వేర్ సెప్టెంబర్- నవంబర్ మధ్యలో అందుబాటులోకి రావొచ్చు.
యాపిల్ కంపెనీ తమ ఇమేజ్ ప్లేగ్రౌండ్ యాప్‌నకు ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారు అనుమతి లేకుండా సామ్ ఆల్ట్మాన్కి చెందిన ఓపెన్‌ఏఐతో వారి డేటా షేర్ అవ్వదని స్పష్టం చేసింది.
ప్రోగ్రామింగ్ టూల్స్ కోసం తమ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ వంటి ఇతర కోడింగ్ మోడళ్లను జోడిస్తామని యాపిల్ తెలిపింది.
యాపిల్ "కాల్ స్క్రీనింగ్" ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తన కాలింగ్ సెక్యూరిటీ గేమ్‌ను మెరుగుపరిచింది. ఈ ఫీచర్‌తో, ఐఫోన్‌లు తెలియని నంబర్‌ల నుంచి వచ్చే కాల్‌లకు స్వయంచాలకంగా సమాధానం ఇస్తాయి. వారి కాల్ ఉద్దేశం ఏమిటో అడుగుతాయి. కాలర్ తమ ఉద్దేశాన్ని చెప్పిన తర్వాత, ఐఫోన్ ఆ కారణం ట్రాన్‌స్క్రిప్షన్‌ను ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత యజమానికి ఫోన్ రింగ్ అవుతుంది.
ఫోన్ కాల్‌లకు లైవ్ ట్రాన్స్‌లేషన్ (ప్రత్యక్ష అనువాదం) ఫీచర్‌ను కూడా జోడిస్తామని, అలాగే డెవలపర్‌లు తమ యాప్‌లలో తమ లైవ్ ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడానికి చోటు కల్పిస్తామని టెక్ దిగ్గజం తెలిపింది. లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ పని చేయడానికి, అవతలి వైపు ఉన్న కాలర్‌కు ఐఫోన్ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అదనంగా, యాపిల్ ఫోన్ యాప్‌ను మ్యాక్‌కు తీసుకురావడం ద్వారా వినియోగదారుల కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తామని సంస్థ తెలిపింది.
ఫోన్ కాల్స్‌తో పాటు, యాపిల్ వినియోగదారులు టెక్స్ట్ మెసేజ్‌లను కూడా స్క్రీన్ చేయగలరు. తద్వారా స్పామ్ మెసేజ్‌లను వేరు చేయడం వారికి సులభతరం అవుతుంది.
ఇది ఇప్పటికే కెమెరా యాప్ ద్వారా చిత్రాల గురించి ఆన్‌లైన్‌లో సమాచారం కోసం శోధించడానికి వినియోగదారులను అనుమతించే అప్లికేషన్. అయితే iOS 26తో విజువల్ ఇంటెలిజెన్స్ వారి స్క్రీన్‌పై కనిపించే చిత్రాలతో కూడా శోధించడానికి వారికి సహాయపడుతుంది.
ఉదాహరణకు.. ఒక వినియోగదారు సోషల్ మీడియా లేదా ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో చూసిన బూట్ల జత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే.. వారు స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ఉపయోగించే బటన్‌లను క్లిక్ చేసి, ఆపై ఆన్‌లైన్‌లో సమాచారం లేదా ఇలాంటి ఉత్పత్తులను పొందడానికి విజువల్ ఇంటెలిజెన్స్ చిహ్నాన్ని ఎంచుకోవచ్చు.
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 లో ప్రకటనల అనంతరం యాపిల్ షేర్లు 1.2శాతం పతనమయ్యాయి.
సంబంధిత కథనం