iOS 18.3.1: కీలకమైన భద్రతా లోపాన్ని సవరించడానికి ఐఓఎస్ 18.3.1 అప్ డేట్ ను విడుదల చేసిన ఆపిల్
iOS 18.3.1: ఐఓఎస్ 18.3.1 అప్డేట్ ను ఆపిల్ విడుదల చేసింది. లాక్ చేసి ఉన్న ఐఫోన్లు సైబర్ అటాకర్ల చేతికి చిక్కితే, వారు యూఎస్బీ రెస్ట్రిక్టెడ్ మోడ్ ను డిసేబుల్ చేయకుండా అడ్డుకోవడం కోసం ఆపిల్ ఈ ఐఓఎస్ 18.3.1 అప్డేట్ ను విడుదల చేసింది.

iOS 18.3.1: ఐఫోన్ ల సెక్యూరిటీని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన భద్రతా లోపాన్ని పరిష్కరించే ఐఓఎస్ 18.3.1 అప్ డేట్ ను ఆపిల్ విడుదల చేసింది. లాక్ అయి ఉన్న ఆపిల్ డివైజెస్ ను ఎవరైనా సైబర్ అటాకర్ అక్రమంగా తీసుకుని, అందులోని యూఎస్బీ రెస్ట్రిక్టెడ్ మోడ్ ను డిసేబుల్ చేసే వీలు కల్పించే ఒక ముఖ్యమైన భద్రతా లోపాన్ని సవరించడం కోసం ఈ అప్ డేట్ ను తీసుకువచ్చారు. ఇది లాక్ అయి ఉన్న ఐ ఫోన్ లోని యూఎస్బీ రెస్ట్రిక్టెడ్ మోడ్ ను ఆ అటాకర్ డిసేబుల్ చేయడాన్ని అడ్డుకుంటుంది. తద్వారా ఆ ఐఫోన్ లోని డేటా సురక్షితంగా ఉంటుంది.
ఆ సెక్యూరిటీ లోపం వల్ల..
USB రిస్ట్రిక్టెడ్ మోడ్ లోని ఆ లోపం అటాకర్లు ఒకవేళ ఐఫోన్ లాక్ చేసి ఉన్నప్పటికీ, అందులోని సెక్యూరిటీలను బైపాస్ చేసి, కనెక్టెడ్ యాక్ససరీలు లేదా కంప్యూటర్ల ద్వారా ఆ ఫోన్ లోని సున్నితమైన యూజర్ డేటాను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆపిల్ కొత్తగా తీసుకువచ్చిన అప్డేట్ ఈ లోపాన్ని తొలగిస్తుంది. ఫోన్ భద్రతను మెరుగుపరుస్తుంది. యూఎస్బీ రిస్ట్రిక్టెడ్ మోడ్ అనేది ఐ ఫోన్ లో ఒక గంట పాటు ఎలాంటి యాక్టివిటీ లేకుండా ఉంటే, ఆ తరువాత ఎలాంటి యూఎస్బీ యాక్సెసరీలను ఆ ఐఫోన్ కు కనెక్ట్ కాకుండా అడ్డుకునే ముఖ్యమైన ఫీచర్.
ఐఓఎస్ 18.3.1 పొందడం ఎలా?
ఈ అప్ డేట్ పొందడానికి ఐఫోన్ యూజర్లు ఈ కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో కావాలి.
- "సెట్టింగ్స్"కు వెళ్లి "జనరల్" ట్యాప్ చేయండి.
- "సాఫ్ట్ వేర్ అప్ డేట్" ట్యాప్ చేయండి.
- అప్ డేట్ అందుబాటులో ఉంటే, "డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్" పై ట్యాప్ చేయండి.
- డౌన్ లోడ్ చేసిన తరువాత, వెంటనే లేదా తరువాత ఇన్ స్టాల్ చేయడానికి ప్రాంప్ట్ లను అనుసరించండి.
- ఐఫోన్ ఎక్స్ఎస్, ఆ తర్వాతి మోడళ్లతో సహా ఐఓఎస్ 18ను సపోర్ట్ చేసే అన్ని ఐఫోన్లకు ఐఓఎస్ 18.3.1 అప్డేట్ అందుబాటులో ఉంది.
ఈ అప్ డేట్ పొందిన తరువాత ఐఫోన్ యూజర్లు ఏం చేయాలి?
ఈ అప్ డేట్ పొందిన తరువాత ఐఫోన్ యూజర్లు ఈ కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఆపిల్ డివైజ్ లోని సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి.
- "ఫేస్ ఐడి & పాస్ కోడ్" లోకి వెళ్లి పరికరం పాస్ కోడ్ ను నమోదు చేయండి.
- "లాక్ చేయబడినప్పుడు ప్రాప్యతను అనుమతించు" కు స్క్రోల్ చేయండి. ఆ తరువాత "యాక్ససరీలు" టాగిల్ కోసం చూడండి.
- ఒకవేళ యాక్ససరీస్ టాగిల్ ఆఫ్ చేసి ఉన్నట్లయితే, పరికరం ఒక గంటకు పైగా లాక్ అయి ఉన్న తరువాత USB యాక్ససరీలను కనెక్ట్ చేయాలంటే, వినియోగదారులు ఆ డివైజ్ ను ముందుగా అన్ లాక్ చేయాలి.
- USB నియంత్రిత మోడ్ ని నిలిపివేయడానికి, వినియోగదారులు టాగిల్ ను ప్రారంభించవచ్చు.
సంబంధిత కథనం