Apple watch : షుగర్​ లెవల్స్​ను చెప్పే యాపిల్​ వాచ్​ వచ్చేస్తోంది!-apple makes major progress on no prick blood glucose tracking for its watch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Makes Major Progress On No-prick Blood Glucose Tracking For Its Watch

Apple watch : షుగర్​ లెవల్స్​ను చెప్పే యాపిల్​ వాచ్​ వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu
Feb 24, 2023 03:28 PM IST

Apple watch sugar level : షుగర్​ పరీక్ష చేయాలంటే రక్తం తీసుకోవాల్సిందే. కానీ అలాంటి అవసరమే లేకుండా.. సరికొత్త టెక్నాలజీతో శరీరంలోని గ్లూకోజ్​ లెవల్స్​ని చూపించే ఫీచర్​ను తన వాచ్​లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది యాపిల్​ సంస్థ!

apple watch 3
apple watch 3

Apple watch health features : ఇప్పుడు వస్తున్న స్మార్ట్​వాచ్​ల్లో.. టైమ్​తో పాటు అనేక హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కూడా వస్తున్నాయి. ఈ వరుసలో యాపిల్​ వాచ్​లు ముందున్నాయి. హెల్త్​ ట్రాకింగ్​కు సంబంధించి ఎన్నో ఫీచర్స్​ వీటిల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు.. మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు యాపిల్​ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అదే.. 'గ్లూకోజ్​ మానిటిరింగ్​'.

ట్రెండింగ్ వార్తలు

సరికొత్త టెక్నాలజీతో..!

సాధారణంగా.. షుగర్​ టెస్ట్​ కోసం రక్తాన్ని బయటకు తీసుకొచ్చి, ఒక స్ట్రిప్​ను అతకించి, ఓ డివైజ్​లో పెట్టి, రీడింగ్స్​ చూడాలి. ఈ కష్టాలేవీ లేకుండా.. డైరక్ట్​గా వాచ్​లోనే రీడింగ్స్​ చూపించే విధంగా ఈ ఫీచర్​ను తీసుకొచ్చేందుకు యాపిల్​ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి ఈ ఈ5 అనే సీక్రెట్​ కోడ్​ పెట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Apple watch sugar levels testing feature : హెల్త్​ ట్రాకింగ్​ పరగా.. ప్రస్తుతం యాపిల్​ వాచ్​లకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఇక ఈ గ్లూకోజ్​ మానిటరింగ్​ కూడా వస్తే.. డయాబెటిక్​ రోగుల్లో ఈ వాచ్​కు డిమాండ్​ కనిపిస్తుందని, ఫలితంగ హెల్త్​ సెక్టార్​లో యాపిల్​ మర్కెట్​ షేర్​ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. అంతేకాకుండా.. ఈ ఫీచర్​ వల్ల లక్షలాది నివాసాల్లో ఈ వాచ్​ ఒక కచ్చితంగా ఉండాల్సిన పరికరంగా మారిపోతుందని సంస్థ అభిప్రాయపడుతోంది.

అయితే.. ఈ గ్లూకోజ్​ మానిటరింగ్​కు సంబంధించిన ఫీచర్​ బయటకొచ్చేందుకు ఇంకొన్నేళ్ల సమయం పట్టొచ్చు. కానీ సక్సెస్​ అయితే మాత్రం.. మిలియన్​ డాలర్​ ఇండస్ట్రీలో యాపిల్​ జాక్​పాట్​ కొట్టినట్టే! ఈ గ్లూకోజ్​ మానిటరింగ్​ కోసం ఓ ప్రత్యేకమైన చిప్​ టెక్నాలజీని యాపిల్​ వాడుతోంది. అదే సిలికాన్​ ఫోటోనిక్స్​తో కూడిన ఆప్టికల్​ అబ్సార్ప్​షన్​ స్పెక్ట్రోస్కోపి. ఈ సిస్టెమ్​.. డివైజ్​ పెట్టిన చర్మం కిందకు ఓ ప్రత్యేక లెంత్​కో కూడిన లైట్​ను పంపిస్తుంది. ఇందులో ఇంటర్​స్టీషిల్​ ఫ్లూయిడ్​ ఉంటుంది. దీనిని గ్లూకోజ్​ గ్రహిస్తుంది. ఆ వెంటనే లైట్​ అనేది రిఫ్లెక్ట్​ అవుతుంది.

Apple watch Glucose monitoring feature : యాపిల్​ ఎక్స్​ప్లోరేటరీ డిజైన్​ గ్రూప్​నకు చెందిన వందలాది మంది ఈ ప్రాజెక్ట్​పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై సంస్థ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత దశాబ్దంలో అనేక మందిపై ఈ గ్లూకోజ్​ టెక్నాలజీని పరీక్షించింది యాపిల్​. తమకు షుగర్​ ఉందా? లేదా? అన్నది తెలియని వారిపై కూడా ప్రయోగాలు చేసింది.

మరి ఇది ఎప్పుడొస్తుంది? ఆరోగ్య రంగంపై ఎంత మాత్రం ప్రభావం చూపిస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.

WhatsApp channel