2023 Apple launches : 2023లో యాపిల్​ లైనప్​ ఇదే! మామూలుగా లేదుగా..-apple launch plans for 2023 iphone 15 watch ipad macbook an more check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Launch Plans For 2023 Iphone 15, Watch, Ipad, Macbook An More Check Details

2023 Apple launches : 2023లో యాపిల్​ లైనప్​ ఇదే! మామూలుగా లేదుగా..

Sharath Chitturi HT Telugu
Feb 25, 2023 01:23 PM IST

Apple launch plans for 2023 : 2023కి సంబంధించి.. యాపిల్​ లైనప్​పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న వార్తలను ఓసారి చూద్దాము..

2023లో యాపిల్​ లైనప్​ ఇదే! మామూలుగా లేదుగా..
2023లో యాపిల్​ లైనప్​ ఇదే! మామూలుగా లేదుగా.. (Jeremy Bezanger/Unsplash)

2023 Apple launches : కొత్త కొత్త లాంచ్​లతో నిత్యం కస్టమర్లను ఆకట్టుకుంటుంది యాపిల్​ సంస్థ. ఇక 2022లో లాంచ్​ అయిన ఐఫోన్​ 14 సిరీస్​తో పాటు అనేక ఉత్పత్తులకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు అందరి చూపు.. 2023 యాపిల్​ లైనప్​పై పడింది. అందుకు తగ్గట్టుగానే యాపిల్​ సంస్థ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్​ లైనప్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఐఫోన్​ 15 సిరీస్​..

2023 Apple lineup : 2023లో మోస్ట్​ అవైటెడ్​ యాపిల్​ ప్రాడెక్ట్​గా ఉంది ఐఫోన్​ 15 సిరీస్​. లీక్స్​ ప్రకారం.. ఈ మొబైల్​ సిరీస్​లో స్టాండర్డ్​ ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​, ఐఫోన్​15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ వంటివి ఉంటాయి. ఐఫోన్​ 15 అల్ట్రా మోడల్​ కూడా వస్తుందని గతంలో ఊహాగానాలు జోరందుకున్నాయి.

యాపిల్​ వాచ్​ సిరీస్​ 9..

ఐఫోన్​ 15 లైనప్​తో పాటు వాచ్​ సిరీస్​ 9పైనా యాపిల్​ ప్రియుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. లీక్స్​ ప్రకారం.. యాపిల్​ వాచ్​ 41ఎంఎం, 45ఎంఎం సైజ్​లో వస్తుంది. స్పెసిఫికేషన్​లు, కొత్త సెన్సార్లు యాడ్​ అవ్వొచ్చు.

న్యూ మాక్​బుక్స్​..

Latest Apple MacBook : ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం.. 14 ఇంచ్​, 16 ఇంచ్​ మాక్​బుక్​ ప్రో మోడల్స్​ను యాపిల్​ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ఎం2 పరో, ఎం2 మ్యాక్స్​ చిప్​సెట్స్​ ఇందులో ఉండొచ్చు. వీటిల్లో లిక్విడ్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే, 1080పీ ఫేస్​ టైమ్​ హెచ్​డీ కెమెరా, 6 స్పీకర్​ సౌండ్​ సిస్టెమ్​, స్టూడియో క్వాలిటీ మైక్స్​ ఉంటాయని సమాచారం.

మాక్​ మినీపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఎం2, ఎం2 ప్రో చిప్​సెట్స్​ ఉండొచ్చని తెలుస్తోంది. ఎం3 ఆధారిత మాక్​బుక్​ ఎయిర్​ కూడా యాపిల్​ లాంచే చేయవచ్చు.

న్యూ ఐప్యాడ్​..

యాపిల్​ ప్రేమికులు.. ఐప్యాడ్​ మినీ 7వ జెనరేషన్​ లాంచ్​ని కూడా ఆశించవచ్చు. ఏ15 బయోనిక్​ చిప్​సెట్​తో కూడిన ఐప్యాడ్​ ప్రో కూడా లాంచ్​ వచ్చొచ్చు.

WhatsApp channel