iPhones Manufacturing unit: ‘ఇండియాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ అక్కడే.. 60వేల మందికి ఉపాధి’-apple iphone manufacturing unit to be setup new hosur it minister ashwini vaishnaw says ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphones Manufacturing Unit: ‘ఇండియాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ అక్కడే.. 60వేల మందికి ఉపాధి’

iPhones Manufacturing unit: ‘ఇండియాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ అక్కడే.. 60వేల మందికి ఉపాధి’

Chatakonda Krishna Prakash HT Telugu
Updated Nov 16, 2022 03:51 PM IST

Apple iPhone Manufacturing Unit: యాపిల్ ఐఫోన్‍ల ఉత్పత్తి భారీ యూనిట్‍లో జరగనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 60వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.

‘ఇండియాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ అక్కడే.. 60వేల మందికి ఉపాధి’
‘ఇండియాలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ అక్కడే.. 60వేల మందికి ఉపాధి’ (AP)

Apple iPhone Manufacturing Unit: ఇండియాలో అతిపెద్ద యాపిల్ ఐఫోన్‍ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Telecom and IT Minister Ashwini Vaishnaw) చెప్పారు. భారత్‍లో ఐఫోన్‍ల తయారీ కోసం టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) తో యాపిల్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‍లో ఐఫోన్లు ఉత్పత్తి కానున్నాయి. బెంగళూరు సమీపంలోని హోసూరులో ఈ ఐఫోన్ ఉత్పత్తి యూనిట్ ఉంటుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. జన్‍జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు వెల్లడించారు.

Apple iPhone Manufacturing Unit: 6,000 మంది గిరిజిన మహిళలకు ఉద్యోగాలు

“ఇండియాలోని అతిపెద్ద తయారీ ప్లాంట్‍లో యాపిల్ ఐఫోన్‍లు ఉత్పత్తి కానున్నాయి. బెంగళూరు సమీపంలోని హోసూరులో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఫ్యాక్టరీలోనే 60,000మంది పని చేస్తారు. రాంచీ, హజరిబాగ్ తదితర ప్రాంతాల నుంచి 6,000 మంది గిరిజన సోదరీమణులు.. ఈ ప్లాంట్‍లో ఉద్యోగాల్లో చేరతారు. యాపిల్ ఐఫోన్‍ల తయారీలో గిరిజన మహిళలకు ఇప్పటికే శిక్షణ జరుగుతోంది” అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. హోసూరు.. తమిళనాడులో ఉంది. అయితే బెంగళూరు కూడా ఈ సిటీ చాలా సమీపంలో ఉంది.

Apple iPhone Manufacturing Unit: హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‍‍లో ఐఫోన్‍లను తయారు చేసేందుకు ఆ సంస్థతో యాపిల్ చేతులు కలిపింది. దేశంలో ఫాక్స్ కాన్, విస్ట్రోన్, పెగాట్రోన్ ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్లాంట్‍లలో ఇప్పటికే ఐఫోన్‍లు తయారవుతున్నాయి. అయితే, ఈ టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్‌‍గా నిలువనుంది.

మరోవైపు ఫాక్స్ కాన్ కూడా తన ప్లాంట్‍లలో ఐఫోన్‍ల తయారీని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం సిబ్బందిని నాలుగింతలు పెంచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Apple iPhone Manufacturing: చైనాలో పరిస్థితుల వల్ల..!

యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. అయితే ఆ దేశంలో కొన్నేళ్లుగా కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొవిడ్-19 ప్రభావంతో జెంగ్‍జోవ్‍లోని ఫాక్స్ కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి మందకొడిగా ఉంది. అలాగే రాజకీయ పరిస్థితులు కూడా చైనాలో అంత సానుకూలంగా లేవు. వివిధ దేశాలతో ముఖ్యంగా తైవాన్ విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు ఉన్నాయి. దీంతో ఐఫోన్‍ల ఉత్పత్తికి ఇండియా అనుకూలంగా ఉంటుందని యాపిల్ భావిస్తోంది. అందుకే ఇక్కడ తయారీ ప్లాంట్స్ ఉన్న ఎలక్ట్రానిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

Whats_app_banner