Tim Cook salary : యాపిల్​ సీఈఓకి 18శాతం శాలరీ హైక్​! ఇప్పుడు మొత్తం జీతం ఎంతో తెలుసా?-apple hikes ceo tim cooks pay 18 to 74 6mn dollars see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tim Cook Salary : యాపిల్​ సీఈఓకి 18శాతం శాలరీ హైక్​! ఇప్పుడు మొత్తం జీతం ఎంతో తెలుసా?

Tim Cook salary : యాపిల్​ సీఈఓకి 18శాతం శాలరీ హైక్​! ఇప్పుడు మొత్తం జీతం ఎంతో తెలుసా?

Sharath Chitturi HT Telugu

Apple CEO Tim Cook : దిగ్గజ టెక్​ సంస్థల్లో సీఈఓలుగా పనిచేసే వారికి జీతాలు ఎక్కువగా ఉంటాయి. మరి టిమ్​ కుక్​ జీతం ఎంతో తెలుసా? 18శాతం హైక్​ తర్వాత, టిమ్​ కుక్​ జీతం ఎంత అంటే..

యాపిల్​ సీఈఓకి 18శాతం శాలరీ హైక్​! (AP Photo / Alberto Pezzali / File)

దిగ్గజ టెక్​ కంపెనీ యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ జీతానికి సంబంధించిన నివేదికలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. తాజా రిపోర్టుల ప్రకారం టిమ్​ కుక్​ కాంపెన్సేషన్​ ప్యాకేజీ 2024లో 18శాతం పెరిగి 74.6 మిలియన్​ డాలర్ల (రూ. 643 కోట్లు)కు చేరింది.  

టిమ్ కుక్ వేతనం పెంపు..

2023లో 63.2 మిలియన్ డాలర్లుగా ఉన్న సీఈఓ టిమ్ కుక్ వేతనం 2024లో 74 .6 మిలియన్ డాలర్లకు పెరిగిందని యాపిల్ జనవరి 10న ప్రాక్సీ ఫైలింగ్​లో పేర్కొంది. ఇందులో స్టాక్​ అవార్డ్​ వాల్యూ ఎక్కువని వివరించింది.

2024లో బేస్ జీతంగా 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, అదనపు పరిహారం కింద సుమారు 13.5 మిలియన్ డాలర్లు అందుకుంటున్నారు టిమ్​ కుక్​.

వాస్తవానికి 2022లోనే యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ జీతం 100 మిలియన్​ డాలర్లకు చేరింది. కాంపెన్సేషన్​లో భాగంగా స్టాక్​ అవార్డులు అధికంగా ఉండటం ఇందుకు కారణం. అయితే ఉద్యోగులు, షేర్​హోల్డర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో టిమ్​ కుక్​ తన జీతాన్ని తగ్గించుకున్నారు. 2023 నుంచి జీతం భారీగా పెరిగినా, 2022తో పోల్చుకుంటే తక్కువే!

యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీఓడీ) "కుక్ టోటల్​ టార్గెట్​ కాంపెన్సేషన్​లో ఎలాంటి మార్పులు చేయలేదు," అని తెలిపింది.

టిమ్​ కుక్​తో పాటు యాపిల్​ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్​ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్​ అందరూ 2024 లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందారు.

డైవర్సిటీ ప్రోగ్రామ్​పై ఆపిల్ నిర్ణయం..

ఇదిలావుండగా, ఉద్యోగుల పట్ల వివక్ష చూపే అవకాశం ఉన్నందున సంస్థకు చెందిన డిఈఐ ప్రోగ్రామ్​ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని వాటాదారులు యాపిల్​ని కోరారు. అయితే, కంపెనీ దీనిని తిరస్కరించిందియ ఈ ప్రతిపాదన యాపిల్ వ్యాపార కార్యకలాపాలను పరిమితం చేయడానికి అనుచిత ప్రయత్నం అని, ఇది ఇప్పటికే చట్టపరమైన, నియంత్రణ ప్రమాదాలను అంచనా వేస్తుందని తెలిపింది.

హార్లీ డేవిడ్సన్, మెక్​డొనాల్డ్, మెటా, వాల్​మార్ట్ వంటి ప్రముఖ కంపెనీలతో సహా అనేక యునైటెడ్ స్టేట్స్ కంపెనీలు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు ముందు తమ వైవిధ్య కార్యక్రమాలను కట్​ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత కథనం