iPhone 15 price in India : ఇండియాలో ఐఫోన్ 15 ధర ఎంతంటే..!
iPhone 15 price in India : యాపిల్ మెగా ఈవెంట్‌కు ముందు.. ఇండియాలో ఐఫోన్ 15 ధరకు సంబంధించిన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఆ వివరాలు.
iPhone 15 price in India : మరికొన్ని గంటల్లో ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచం ముందుకు రానుంది. వివిధ మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది యాపిల్ సంస్థ. ఇందుకు సంబంధించిన ఈవెంట్.. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. అయితే, ఈవెంట్‌కు ముందు ఇండియాలో ఐఫోన్ 15 ధరకు సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. ఆ వివరాలు..
ట్రెండింగ్ వార్తలు
ఇండియాలో ఐఫోన్ 15 ధర ఎంత ఉంటుంది?
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వంటి మోడల్స్ ఉంటాయని సమాచారం. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, ఐఫోన్ 15 ప్లస్ ధర 899 డాలర్లుగా ఉండొచ్చని రూమర్స్ బయటకు వచ్చాయి. మిగిలిన రెండు మోడల్స్ ధరలు.. వీటి కన్నా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
iPhone 15 launch date : ఈ లెక్కన చూసుకుంటే.. ఇండియాలో యాపిల్ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది.
ప్రస్తుతానికైతే ఇవి రూమర్స్ మాత్రమే. సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మంగళవారం రాత్రి జరగనున్న యాపిల్ ఈవెంట్లో మోడల్స్, వాటి ధరలపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
ఇదీ చూడండి:- iPhone 15 ultra : యాపిల్ ఈవెంట్‌కు ముందు.. 'ఐఫోన్ 15 అల్ట్రా'పై కీలక అప్డేట్!
యాపిల్ ఈవెంట్ ఎక్కడ చూడాలి..?
యాపిల్ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఈ వండర్లస్ట్ ఈవెంట్.. కాలిఫోర్నియాలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం అయితే.. మంగళవారం రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. సంస్థ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్ లైవ్‌స్ట్రీమింగ్ చూడవచ్చు.
Apple iPhone 15 price : కొవిడ్ కారణంగా గత కొన్నేళ్లు ఈ యాపిల్ ఈవెంట్ ఆన్లైన్ వేదికగా జరిగింది. కానీ ఈసారి ఈవెంట్‌ను డైరక్ట్‌గా నిర్వహించాలని నిర్ణయించుకుంది సంస్థ. ఇందుకోసం కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ సిద్ధమైంది.
మరోవైపు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. సప్లై చెయిన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని సమాచారం. ఇదే నిజమైనా.. యాపిల్ ఈవెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం