Tim Cook pay cut : యాపిల్​ సీఈఓ జీతంలో 40శాతం కట్​!-apple ceo tim cook takes rare pay cut after pushback reports says salary down by 40 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Apple Ceo Tim Cook Takes Rare Pay Cut After Pushback Reports Says Salary Down By 40 Percent

Tim Cook pay cut : యాపిల్​ సీఈఓ జీతంలో 40శాతం కట్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 13, 2023 08:22 AM IST

Tim Cook pay cut : యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ జీతంలో 40శాతం కోత పడనుంది! 2023లో ఆయన 49 మిలియన్​ డాలర్లు విలువ చేసే ప్యాకేజీని పొందనున్నారు.

యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​
యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ (via REUTERS)

Apple CEO Tim Cook pay cut : సంస్థ సీఈఓ టిమ్​ కుక్​ జీతంలో భారీ కోత విధించేందుకు యాపిల్​ సంస్థ సిద్ధమవుతోందని తెలుస్తోంది. మొత్తం మీద.. టిమ్​​ కుక్​కు అందే ప్యాకేజీలో 40శాతం కోత పడే అవకాశం ఉన్నట్టు ఇన్​వెస్టర్​ గైడెన్స్​ నివేదిక పేర్కొంది. అయితే.. తన ప్యాకేజీలో కోత విధించాలని టిమ్​ కుక్​.. స్వయంగా సంస్థకు చెప్పినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

49 మిలియన్​ డాలర్ల ప్యాకేజీ..

2022లో టిమ్​ కుక్​ బేస్​ శాలరీ కింద 3 మిలియన్​ డాలర్లు. స్టాక్స్, బోనస్​​​ రూపంలో మరో 83 మిలియన్​ డాలర్లు పొందారు. మొత్తం మీద 2022లో టిమ్​​ కుక్​ 99.4 మిలియన్​ డాలర్లు చెల్లించింది యాపిల్​. 2021లో అది 98.7 మిలియన్​ డాలర్లుగా ఉండేది. ఇక ఇప్పుడు.. 2023లో యాపిల్​ సంస్థ ప్రదర్శన బట్టి టిమ్​​ కుక్​ వద్ద ఉన్న స్టాక్​ యూనిట్లు 50శాతం నుంచి 75శాతానికి చేరుతాయి.

Tim Cook pay cut : షేర్​హోల్డర్ల ఫీడ్​బ్యాక్​, యాపిల్​ ప్రదర్శన, టిమ్​ కుక్​ సిఫార్సు మేరకు.. సీఈఓ జీతంలో కోత విధిస్తున్నట్టు యాపిల్​ సంస్థ పేర్కొంది.

సీఈఓ ప్యాకేజీపై విమర్శలు..!

టిమ్​ కుక్​కు యాపిల్​ చెల్లిస్తున్న కాంపెన్సేషన్​పై మార్కెట్​ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది.. ఆయన కాంపెన్సేషన్​ ప్యాకేజీకి ఆమోదం లభించినా.. ఇన్​స్టిట్యూషనల్​ షేర్​హోల్డర్​ సర్వీసెస్​ వంటి బృందాలు విమర్శల వర్షం కురిపించాయి. ప్రదర్శన ఆధారంగా టిమ్​ కుక్​ కాంపెన్సేషన్​ ప్యాకేజీ లేదని ఆరోపించాయి. యాపిల్​ షేర్​ ప్రైజ్​ పతనమవుతున్నా.. ఆయనకు అంత మొత్తంలో జీతం ఎలా ఇస్తారని ప్రశ్నించాయి.

Tim Cook salary news : తాజా పరిణామాలతో 2023లో టిమ్​ కుక్​ కాంపెన్సేషన్​.. 49 మిలియన్​ డాలర్లకు పడిపోనుంది! ఇందులోనే 3 మిలియన్​ డాలర్ల బేస్​ శాలరీ, 6 మిలియన్​ డాలర్ల బోనస్​ ఉండనున్నాయి. 40 మిలియన్​ డాలర్లు విలువ చేసే ఈక్విటీ కూడా ఈ కాంపెన్సేషన్​లో భాగం. 2022లో ఆ విలువ 75 మిలియన్​ డాలర్లుగా ఉండేది.

62ఏళ్ల యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​.. తన సంపదను ఛారిటీ కార్యక్రమాలకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.

గతేడాదిలో యాపిల్​ సంస్థ షేర్లు 27శాతం పతనమయ్యాయి. నాస్​డాక్​తో పోల్చుకుంటే ఇది తక్కువే! యాపిల్​ సంస్థ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటికే దాదాపు 2.8శాతం పెరిగాయి.

Apple share price : తమ జీతాల్లో కోత విధంచాలని సీఈఓలే చెప్పడం చాలా అరుదైన విషయం. వాస్తవానికి కొన్నేళ్లుగా సీఈఓల జీతాలు పెరుగుతూ వచ్చాయి. బ్లూమ్​బర్గ్​ డేటా ప్రకారం.. చాలా మంది సీఈఓలు 2021లో రికార్డు స్థాయిలో జీతాలు తీసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం