Anant Ambani wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుక: హాజరు కానున్న ప్రముఖులు వీరే-anant ambani wedding list of indian personalities likely to attend ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Anant Ambani Wedding: List Of Indian Personalities Likely To Attend

Anant Ambani wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుక: హాజరు కానున్న ప్రముఖులు వీరే

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 01:49 PM IST

ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన భారతీయ దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట త్వరలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. త్వరలో ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్ తో జరగనుంది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (ANI )

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జూలై 12న ముంబైలో జరగనుంది. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడా తారలు, నటులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భారతీయ అతిథుల జాబితా ఇక్కడ ఉంది. ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా, ఉదయ్ కోటక్, అదార్ పూనావాలా, గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా సహా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు

గత జనవరిలో నిశ్చితార్థం

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం గత ఏడాది జనవరిలో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇటీవల రిలయన్స్ ఫౌండేషన్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో గుజరాత్ కు చెందిన మహిళలు పెళ్లి కోసం బంధనీ కండువాలు ధరించిన దృశ్యాలు కనిపించాయి. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్, అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కూడా ఈ వీడియోలో కనిపించారు.

వ్యాపార రంగం:

1. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర

2. కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ

3. గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ

4. గోద్రెజ్ కుటుంబం

5. నందన్ నీలేకని

6. సంజీవ్ గోయెంకా

7. రిషద్ ప్రేమ్ జీ

8. ఉదయ్ కోటక్

9. అదర్ పూనావాలా

10. సునీల్ మిట్టల్

11. పవన్ ముంజల్

12. రోషిణి నాడార్

13. నిఖిల్ కామత్

14. రోనీ స్క్రూవాలా

క్రీడా రంగం:

1. సచిన్ టెండూల్కర్ అండ్ ఫ్యామిలీ

2. ఎంఎస్ ధోనీ అండ్ ఫ్యామిలీ

3. రోహిత్ శర్మ

4. కేఎల్ రాహుల్

5. హార్దిక్, కృనాల్ పాండ్యా

6. ఇషాన్ కిషన్

7. విరాట్ కోహ్లీ

సినిమా రంగం

1. అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ

2. అభిషేక్, ఐశ్వర్యారాయ్ బచ్చన్

3. రజినీకాంత్ అండ్ ఫ్యామిలీ

4. షారుఖ్ ఖాన్ అండ్ ఫ్యామిలీ

5. అమీర్ ఖాన్ అండ్ ఫ్యామిలీ

6. సల్మాన్ ఖాన్

7. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

8. అజయ్ దేవగణ్, కాజోల్

9. సైఫ్ అలీఖాన్ అండ్ ఫ్యామిలీ

10. చుంకీ పాండే అండ్ ఫ్యామిలీ

11. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె

12. రణబీర్ కపూర్, అలియా భట్

13. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్

14. మాధురీ దీక్షిత్ & శ్రీరామ్ నేనే

15. ఆదిత్య, రాణి చోప్రా

16. కరణ్ జోహార్

17. బోనీ కపూర్ అండ్ ఫ్యామిలీ

18. అనిల్ కపూర్ అండ్ ఫ్యామిలీ

19. వరుణ్ ధావన్

20. సిద్ధార్థ్ మల్హోత్రా

21. శ్రద్ధా కపూర్

22. కరిష్మా కపూర్

WhatsApp channel