Ambani's wedding: 51 వేల మందికి అన్న సేవతో ప్రారంభమైన అనంత్ అంబానీ వివాహ వేడుకలు-anant ambani radhika merchants pre wedding event begins 51 000 served food ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Anant Ambani-radhika Merchant's Pre-wedding Event Begins, 51,000 Served Food

Ambani's wedding: 51 వేల మందికి అన్న సేవతో ప్రారంభమైన అనంత్ అంబానీ వివాహ వేడుకలు

HT Telugu Desk HT Telugu
Feb 29, 2024 12:18 PM IST

Ambani's wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూర్తిగా సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ వేడుకలను జరిపిస్తున్నారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్ తో జరగనుంది.

అతిథులకు స్వయంగా వడ్డిస్తున్న రాధిక మర్చంట్, అనంత్ అంబానీ
అతిథులకు స్వయంగా వడ్డిస్తున్న రాధిక మర్చంట్, అనంత్ అంబానీ (ANI)

Ambani's wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో బుధవారం సంప్రదాయ పద్ధతిలో 'అన్నసేవ'తో ప్రారంభమయ్యాయి. జామ్ నగర్ లోని రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముకేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధికా మర్చంట్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్థులకు సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించడంలో పాల్గొన్నారు. రాధికా మర్చంట్ తో పాటు ఆమె తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్, ఆమె అమ్మమ్మ 'అన్నసేవ'లో పాల్గొన్నారు. గ్రామంలోని సుమారు 51,000 మంది స్థానికులకు షడ్రుచులతో భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమం రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

జానపద సంగీతం కూడా..

అన్నసేవ అనంతరం ఆహుతులు సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ తన అసాధారణ గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సంప్రదాయబద్ధంగా, విలాసవంతంగా జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటేలా రూపొందించారు. గుజరాత్ లోని కచ్, లాల్ పూర్ కు చెందిన మహిళా కళాకారులు రూపొందించిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందజేయనున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబైలోని కుటుంబ నివాసం అంటిలియాలో సంప్రదాయబద్ధంగా జరిగింది.

బంధనీ కండువాలు

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకల కోసం గుజరాత్ కు చెందిన మహిళలు బంధనీ కండువాలు ధరించిన వీడియోను రిలయన్స్ ఫౌండేషన్ ఇటీవల తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ స్వయంగా కళాకారులతో సంభాషించడం, వారి కృషి పట్ల తన ఆనందాన్ని, ప్రశంసలను వ్యక్తం చేయడం కూడా ఈ వీడియోలో ఉంది.

ముఖ్య అతిథులు ఎవరు?

మార్చి 1 నుంచి 3 వరకు జరిగే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకలకు ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ క్వీన్ జెట్సన్ పెమా, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, సౌదీ ఆరామ్ కొ చైర్ పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. అతిథుల జాబితాలో స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్ పర్సన్ క్లాస్ ష్వాబ్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రుడ్ ఉన్నారు.

అంబానీల వ్యాపారాలు

ముకేశ్, నీతా అంబానీ ల ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ. ఇటీవలి సంవత్సరాలలో ఆర్ఐఎల్ యొక్క గణనీయమైన వెంచర్లకు నాయకత్వం వహించడంలో మరియు పర్యవేక్షించడంలో చురుకుగా నిమగ్నమయ్యారు. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాలు వంటి వివిధ రంగాల నిర్వహణను ముకేశ్ అంబానీ తన పిల్లలకే అప్పగించారు.

WhatsApp channel