Electric scooter : మిడిల్​ క్లాస్​ వారి ముందుకు 2 బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్లు​- ఏది బెస్ట్​?-ampere magnus neo vs ola s1 x which electric scooter is best checkout price and specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : మిడిల్​ క్లాస్​ వారి ముందుకు 2 బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్లు​- ఏది బెస్ట్​?

Electric scooter : మిడిల్​ క్లాస్​ వారి ముందుకు 2 బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్లు​- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Published Feb 11, 2025 07:07 AM IST

యాంపియర్ మాగ్నస్ నియో వర్సెస్​ ఓలా ఎస్1 ఎక్స్.. ఈ రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? దేని రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలు..

యాంపియర్ మాగ్నస్ నియో వర్సెస్​ ఓలా ఎస్1 ఎక్స్
యాంపియర్ మాగ్నస్ నియో వర్సెస్​ ఓలా ఎస్1 ఎక్స్

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మార్కెట్​లో చాలా ఆప్షన్లే ఉన్నాయి. మీరు బడ్జెట్​ ఫ్రెండ్లీ ఈ-స్కూటర్​లను చూస్తే మాత్రం ఓలా ఎలక్ట్రిక్​, యాంపియర్​ ఈవీ సంస్థ ప్రాడక్ట్స్​ మంచి ఆప్షన్​ అని ఆటోమొబైల్​ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఓలా ఎస్​1 ఎక్స్​, యాంపియర్​ మాగ్నస్​ నియో ఎలక్ట్రిక్​ స్కూటర్​లకు చక్కటి డిమాండ్​ కనిపిస్తోంది. వీటి మధ్య పోటీ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లను పోల్చి.. దేని రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాంపియర్ మాగ్నస్ నియో వర్సెస్ ఓలా ఎస్1 ఎక్స్: ధర..

యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రారంభ ధర రూ .79,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ .69,999 (ఎక్స్-షోరూమ్). దీని ధర రూ.96,999 (ఎక్స్ షోరూమ్) వరకు వెళుతుంది. కాగా ఓలా ఎస్1 ఎక్స్​తో పోలిస్తే యాంపియర్ మాగ్నస్ నియో బేస్ వేరియంట్ ధర రూ.10,000 తక్కువ.

యాంపియర్ మాగ్నస్ నియో వర్సెస్ ఓలా ఎస్ 1 ఎక్స్: స్పెసిఫికేషన్స్​..

యాంపియర్ మాగ్నస్ నియో 2.3 కిలోవాట్ల ఎల్ఎఫ్​పీ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్​తో కనెక్ట్​ చేశారు. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టెమ్ 100 కిలోమీటర్లకు పైగా రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇది గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్​ చేసేందుకు ఆరు గంటల సమయం పడుతుంది.

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎక్స్​లో కూడా హబ్ మౌంటెడ్ మోటార్ ఉంది. 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వర్షెన్ గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుంది. 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ప్రొపెల్డ్ వేరియంట్ 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్​తో ఫుల్ ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆధారిత వర్షెన్.. 90 కిలోమీటర్ల టాప్​ స్పీడ్​తో, ఫుల్ ఛార్జ్ చేస్తే 193 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుంది.

మరి ఈ రెండింటిలో మీకు ఏ ఎలక్ట్రిక్​ స్కూటర్​ నచ్చింది? ఏది ఈ-స్కూటర్​ని కొంటారు?

Whats_app_banner

సంబంధిత కథనం