AMIC Forging IPO: ఏఎంఐసీ ఫోర్జింగ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ రెస్పాన్స్; జీఎంపీ ఎంతంటే..?
AMIC Forging IPO: ఏఎంఐసీఫోర్జింగ్ లిమిటెడ్ IPO (AMIC Forging IPO) మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఈ చిన్న, మధ్య తరహా రంగంలోని పరిశ్రమ ఈ ఐపీఓ ద్వారా రూ. 34.80 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
AMIC Forging IPO: ఏఎంఐసీఫోర్జింగ్ లిమిటెడ్ IPO (AMIC Forging IPO) నవంబర్ 29న ఓపెన్ అయింది. డిసెంబర్ 1వ తేదీతో సబ్ స్క్రిప్షన్ గడువు ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 121 నుంచి రూ. 126 మధ్య ఉంది. ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో రూ. 10 ముఖ విలువ కలిగిన 1000 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఒక లాట్ కు ఇన్వెస్ట్ చేయడానికి కనీసం రూ. 1,26,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కాళీ మాతా ఫోర్జింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ ఏఎంఐసీఫోర్జింగ్ లిమిటెడ్ ను గతంలో కాళీ మాతా ఫోర్జింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ సంస్థ ఇంజనీరింగ్, స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, కెమికల్స్, రిఫైనరీస్, థర్మల్ పవర్, న్యూక్లియర్ పవర్, హైడ్రోపవర్, సిమెంట్ వంటి వివిధ రకాల పరిశ్రమలకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కస్టమర్ స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా యంత్ర భాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ప్రమోటర్లుగా గిర్ధారి లాల్ చమారియా, అన్షుల్ చమారియా, మంజు చమారియా, రష్మీ చమారియా ఉన్నారు.
IPO details: ఐపీఓ వివరాలు
ఈ ఐపీఓ ద్వారా ఏఎంఐసీఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థ రూ. 34.80 కోట్ల విలువైన 2,762,000 ఈక్విటీ షేర్లను సేల్ చేస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ఆప్షన్ లేదు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను కంపెనీ సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మౌలిక సౌకర్యాల స్థాపనకు ఉపయోగిస్తుంది. ఈ ఐపీఓలో 50% షేర్లను క్యూఐబీ (QIB) లకు, 15% షేర్లను ఎన్ఐఐ (NII)లకు, 35% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
subscription status, GMP: సబ్ స్క్రిప్షన్ స్టేటస్, జీఎంపీ
AMIC ఫోర్జింగ్ ఐపీఓ శుక్రవారం నాటికి 116.78 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు 144.99 రెట్లు, క్యూఐబీలు 26.39 రెట్లు, ఎన్ఐఐలు 171.17 రెట్లు సబ్ స్క్రైబ్ చేశారు. అలాగే, శుక్రవారం నాడు ఈ సంస్థ షేర్లు గ్రే మర్కెట్లో రూ. 70 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, ఇష్యూ ప్రైస్ రూ. 126 అయితే, లిస్టింగ్ రోజు ఈ సంస్థ షేర్లు రూ. 196 తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
సూచన: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకుని ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.