Ambrane Crest Pro: రగెడ్ డిజైన్, లూసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే-ambrane crest pro smartwatch launched check price features sale details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Ambrane Crest Pro Smartwatch Launched Check Price Features Sale Details

Ambrane Crest Pro: రగెడ్ డిజైన్, లూసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
May 29, 2023 10:06 PM IST

Ambrane Crest Pro Smartwatch: ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. రఫ్‍గా ఉండే రగెడ్ డిజైన్‍తో ఈ వాచ్ వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.

Ambrane Crest Pro: రగెడ్ డిజైన్, లూసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Ambrane)
Ambrane Crest Pro: రగెడ్ డిజైన్, లూసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Ambrane)

Ambrane Crest Pro Smartwatch: దేశీయ కంపెనీ ఆంబ్రేన్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లోకి వచ్చింది. స్పోర్టీ, రఫ్ లుక్‍తో ఉండే రగెడ్ డిజైన్‍తో ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో లాంచ్ అయింది. రౌండ్ షేప్డ్ లుసిడ్ డిస్‍ప్లే, మెటల్ బాడీని ఈ వాచ్ కలిగి ఉంది. ఈ వాచ్‍లో బుల్ట్ఇన్‍గా కంపాస్ ఉంది. 100కు పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

1.52 ఇంచుల రౌండ్ షేప్ ఫుల్ టచ్ లుసిడ్ డిస్‍ప్లేతో ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్ వచ్చింది. 360x360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్‍ను ఈ డిస్‍ప్లే కలిగి ఉంది. ఈ వాచ్‍కు మూడు ఫంక్షనల్ బటన్స్ ఉన్నాయి. 100కు పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

మెటాలిక్ బాడీని ఈ ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ కలిగి ఉంది. రఫ్‍గా వినియోగించేందుకు వీలుగా రగెడ్ డిజైన్‍తో ఈ స్మార్ట్‌వాచ్ వచ్చింది. బుల్ట్ఇన్‍గా కంపాస్ ఉండడం ఈ వాచ్‍కు ప్రత్యేకతగా ఉంది. కంపాస్ వల్ల అడ్వెంచర్లకు ఈ వాచ్ మరింత సూటవుతుంది.

బ్లూటూత్ కాలింగ్‍ ఫీచర్‌తో ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ వచ్చింది. దీంతో ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారా కాల్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఫోన్ మ్యూజిక్ ప్లే బ్లాక్‍ను, కెమెరాను వాచ్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను పొందవచ్చు.

హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2, బ్లడ్ ప్లజర్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ కలిగి ఉంది. విభిన్న స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‍లో 400mAh బ్యాటరీ ఉంది. ఫుల్ చార్జ్‌పై ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆంబ్రేన్ పేర్కొంది.

ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ ధర, సేల్

ఆంబ్రేన్ క్రెస్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‍ ధర రూ.2,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఆంబ్రేన్ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, గ్రీన్, కామోఫ్లాజ్ గ్రీన్, కామోఫ్లాజ్ బ్రౌన్, కామోఫ్లాజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది.

WhatsApp channel