Ambey Laboratories IPO: అగ్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ అంబే లేబొరేటరీస్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ () జూలై 4, గురువారం సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ (SME IPO) కు జూలై 8, సోమవారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అంబే లేబొరేటరీస్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.65 నుంచి రూ.68 మధ్య నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 2,000 షేర్లు ఉన్న లాట్ కు బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే, కనీసం రూ. 1,36,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ పెయిడ్-అప్ క్యాపిటల్ లో 26.34 శాతం ఈ ఇష్యూ ద్వారా సమకూరుతుంది.
ఆంబే లేబొరేటరీస్ (Ambey Laboratories) సుమారు నలభై సంవత్సరాలుగా వ్యవసాయ రసాయన పరిశ్రమకు సేవలను అందిస్తోంది. ఈ సంస్థ పంటలను సంరక్షించడానికి వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తుంది. రసాయన వ్యాపారంలో, ఈ సంస్థ నాణ్యత, పర్యావరణ, ఆరోగ్యం మరియు భద్రత (ఇహెచ్ఎస్) చట్టాలకు కఠినంగా కట్టుబడి ఉంటుంది. అందువల్ల ఈ సంస్థ ‘2,4-డీ బేస్ కెమికల్స్’ ను ఉత్పత్తి చేస్తుంది, పంపిణీ చేస్తుంది. వీటి తయారీ కోసం ఈ కంపెనీకి రాజస్థాన్ లోని బెహ్రోర్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఉంది. ఇక్కడ ఉత్పత్తి ప్రతి దశలో HPLC, GC, UV, ఇతర పద్ధతుల ద్వారా టెస్టింగ్ ను నిర్ధారిస్తుంది.
అంబే లేబొరేటరీస్ ఐపీఓ (Ambey Laboratories IPO) మొదటి రోజు 7.48 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. రిటైల్ పోర్షన్ 11.91 రెట్లు, ఎన్ఐఐ పోర్షన్ 6.98 రెట్లు బుక్ అయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ ఇంకా బుక్ కాలేదు. భారత కాలమానం ప్రకారం జూలై 4 మధ్యాహ్నం 1 గంటకు 40,42,001 షేర్లకు గాను 3,02,32,000 షేర్లకు బిడ్లు వచ్చాయి.
రూ.44.68 కోట్లు సమీకరించే లక్ష్యంతో రూ.10 ముఖ విలువ కలిగిన 65,70,000 ఈక్విటీ షేర్లతో తొలి కాంబినేషన్ బుక్ బిల్డింగ్ రూట్ ఐపీఓను ప్రారంభించింది. ఈ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 3,12,000 షేర్లు, 62,58,000 తాజా ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు ఇతర సాధారణ వ్యాపార లక్ష్యాలకు వినియోగించనున్నారు.
అంబే లేబొరేటరీస్ ఐపీఓ జీఎంపీ (GMP) జూలై 4వ తేదీన +33 గా ఉంది. అంటే, ఈ ఐపీఓ షేర్లకు గరిష్ట ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 68 కన్నా రూ. 33 ఎక్కువగా లిస్టింగ్ ధర లభించే అవకాశం ఉంది. ఇది దాదాపు 48.53% ఎక్కువ.
సూచన: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవే తప్ప హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.