ఈ వారంలో రెండు రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ వెబ్‌సైట్‌లోని స్టాక్ మార్కెట్ హాలిడే లిస్ట్ ప్రకారం, సోమవారం బీఎస్ఈ లేదా ఎన్ఎస్‌ఈలో ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ప్రతి ఏటా జరుపుకొంటారు. అంబేడ్కర్ జయంతి తర్వాత ఏప్రిల్ 15న మార్కెట్ తిరిగి తెరుచుకోనుంది. దీంతో పాటు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 18 శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది.
కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ 2025 ఏప్రిల్ 14 సోమవారం, ఏప్రిల్ 18, 2025 శుక్రవారం జరగదు. వీటితో పాటు కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు(ఈజీఆర్) కూడా నిలిచిపోనున్నాయి. మరింత సమాచారం కోసం, పెట్టుబడిదారులు బీఎస్ఈ-bseindia.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 2025లో స్టాక్ మార్కెట్లో రాబోయే సెలవులు చూద్దాం.. .
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14 (సోమవారం)
గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 18 (శుక్రవారం)
మహారాష్ట్ర దినోత్సవం - మే 1 (గురువారం)
స్వాతంత్య్ర దినోత్సవం - ఆగస్టు 15 (శుక్రవారం)
గణేష్ చతుర్థి - ఆగస్టు 27 (బుధవారం)
మహాత్మా గాంధీ జయంతి దసరా - అక్టోబర్ 2 (గురువారం)
దీపావళి / లక్ష్మీ పూజ - అక్టోబర్ 21 (మంగళవారం)
దీపావళి బలిప్రతిపాద - అక్టోబర్ 22 (బుధవారం)
ప్రకాష్ గురుపురబ్ శ్రీ గురునానక్ దేవ్ - నవంబర్ 5 (బుధవారం)
క్రిస్మస్ - డిసెంబర్ 25 (గురువారం)
ఇదిలావుండగా భారత స్టాక్ మార్కెట్లో అస్థిరత ఇటీవల పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యలతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి.
త్రిపుర, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, జార్ఖండ్, సిక్కిం, తమిళనాడు, గుజరాత్, చండీగఢ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాంలలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. మధ్యప్రదేశ్, నాగాలాండ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. వినియోగదారులు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వాడుకోవచ్చు.
అంబేద్కర్ జయంతి సోమవారం వచ్చింది. దేశవ్యాప్తంగా ఘనంగా ఈ జయంతిని నిర్వహిస్తారు. ఇది జాతీయ సెలవుదినం కాబట్టి చాలా వరకు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేసి ఉంటాయి.
సంబంధిత కథనం