అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఈ సేల్‌లో మీ కోసం చాలా ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ డీల్‌ను వెల్లడించింది. ఈ సేల్లో శాంసంగ్, ఆపిల్ ఐఫోన్, వన్‌ప్లస్ సహా పలు పాపులర్ స్మార్ట్‌ఫోన్ బంపర్ డిస్కౌంట్లతో లభిస్తాయి. ఇక్కడ మీకు కొన్ని ఫోన్ల గురించి చెబుతున్నాం..
ప్రైమ్ డే సేల్ సందర్భంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఏ23 అల్ట్రా ఆఫర్ల తర్వాత కేవలం రూ.74,999 ధరకు లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది. ఈ ధర వద్ద 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండనుంది. లాంచ్ సమయంలో ఈ మోడల్ ధర రూ.1,24,999గా ఉంది. అంటే సేల్‌లో లాంచ్ ధర నుంచి రూ.50,000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. జూలై 20 నుంచి ఈ డీల్ అమల్లోకి రానుంది.
ఐక్యూ నుంచి వచ్చిన ఈ కూల్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.20,999 ధరకు సెల్‌లో లభిస్తుంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.24,999గా ఉంది. అంటే నేరుగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డీల్ జూలై 20న కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో 6.78 అంగుళాల కర్వ్ డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. జూలై 20 నుంచి ఈ డీల్ అమల్లోకి రానుంది.
తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే ప్లాన్ ఉంటే, ఆఫర్ల తర్వాత ఐఫోన్13 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.47,999కు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900. అంటే ఈ సేల్ ద్వారా రూ.11,901 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్‌ప్లే, ఏ15 బయోనిక్ చిప్‌సెట్, 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. జూలై 20 నుంచి ఈ డీల్ అందుబాటులోకి రానుంది.
సేల్ లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో కూడిన గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999కు ఉంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.49,999గా ఉంది. అంటే లాంచ్ ధర కంటే పూర్తి రూ.22,000 తక్కువకు సెల్‌లో ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ల తర్వాత రూ.52,999 ధరకు లభిస్తుంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.64,999గాఉంది. అంటే సేల్‌లో రూ.12,000 డిస్కౌంట్ పోతుంది. ఇందులో 6.82 అంగుళాల 2కే ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఓఐఎస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 100వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5400 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.