Amazon Layoffs: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2025 లో కంపెనీ ఖర్చులను ఆదా చేేసే లక్ష్యంతో 14,000 మంది మేనేజ్మెంట్ ఉద్యోగాలను తొలగించనుందని,పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఇది దాదాపు 13 శాతం ఉద్యోగుల తగ్గింపుకు సమానం. ఈ లే ఆఫ్ ల తర్వాత ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేనేజీరియల్ ఉద్యోగాల కోతతో సంస్థలో మేనేజర్ల సంఖ్య 91,936కు తగ్గుతుంది. ప్రస్తుతం సంస్థలో 1,05,770 మంది మేనేజర్లు ఉన్నారు.
కంప్లీట్ సర్కిల్ మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) గుర్మీత్ చద్దా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో అమెజాన్ లో ఉద్యోగాల కోతల గురించి వివరించారు. అమెజాన్ గత నవంబర్ లో 18 వేల మందిని తొలగించిన తర్వాత ఇప్పుడు మరో 14,000 మందిని తొలగిస్తోంది. వారు తమ హెచ్ఆర్ హెడ్ లను పీపుల్ ఎక్స్పీరియన్స్ హెడ్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అని ఫ్యాన్సీ పేర్లతో పిలుస్తారు. ఉద్యోగులను తమ కుటుంబాలు అని చెబుతారు. కానీ అది అంతా పెద్ద డ్రామా!!" అని చద్దా ఆ పోస్ట్ లో విమర్శించారు. ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం నిరుపయోగమని ఆయన వ్యాఖ్యానించారు. "నన్ను ఓల్డ్ స్కూల్ అని పిలిచినా పర్లేదు. కానీ నేను అన్నింటికంటే వ్యక్తులకు ఎక్కువ విలువ ఇస్తాను. గురునానక్ దేవ్ జీ చెప్పినట్లు ఏ ఆవిష్కరణ జరిగినా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా (సర్బత్ దా భల్లా) ఉండాలి’’ అని ఛద్దా వ్యాఖ్యానించారు.
జనవరి 2025 బిజినెస్ ఇన్సైడర్ సంచిక ప్రకారం, అమెజాన్ తన మేనేజర్లలో కొంతమందికి వారి ప్రత్యక్ష నివేదికలను పెంచాలని, తక్కువ సీనియర్ రిక్రూట్మెంట్ లు చేయాలని, కొంతమంది ఉద్యోగులకు చెల్లింపులను తగ్గించాలని చెప్పింది.
సంబంధిత కథనం