Amazon Bengaluru office : బెంగళూరు ఆఫీస్​ని ఖాళీ చేస్తున్న దిగ్గజ సంస్థ- ఉద్యోగుల్లో అసంతృప్తి!-amazon india to move bengaluru headquarters to cut costs employees unhappy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Bengaluru Office : బెంగళూరు ఆఫీస్​ని ఖాళీ చేస్తున్న దిగ్గజ సంస్థ- ఉద్యోగుల్లో అసంతృప్తి!

Amazon Bengaluru office : బెంగళూరు ఆఫీస్​ని ఖాళీ చేస్తున్న దిగ్గజ సంస్థ- ఉద్యోగుల్లో అసంతృప్తి!

Sharath Chitturi HT Telugu
Nov 18, 2024 01:58 PM IST

Amazon Bangalore office : బెంగళూరులోని వరల్డ్​ ట్రేడ్​ సెంటర్స్​ నుంచి తన హెడ్​క్వార్టర్స్​ని షిఫ్ట్​ చేస్తోంది అమెజాన్​ ఇండియా! కాస్ట్​ కటింగ్​, ఎయిర్​పోర్ట్​కి దగ్గరగా ఉండాలన్న నిర్ణయంతో ప్రస్తుత భవనాన్ని ఖాళీ చేస్తోంది.

బెంగళూరు ఆఫీస్​ని ఖాళీ చేస్తున్న దిగ్గజ సంస్థ!
బెంగళూరు ఆఫీస్​ని ఖాళీ చేస్తున్న దిగ్గజ సంస్థ! (Dado Ruvic/Reuters)

మహా నగరం బెంగళూరులో నానాటికి పెరిగిపోతున్న రెంట్స్​ వ్యవహారం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇక ఇప్పుడు ఒక దిగ్గజ సంస్థ, కాస్ట్​ కటింగ్​ పేరుతో ఏకంగా తన హెడ్​క్వార్టర్స్​నే మార్చేస్తోంది! అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్​క్వార్టర్స్​ని వాయువ్య బెంగళూరులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి నగర శివార్లకు మారుస్తోంది! ఖర్చు తగ్గించే స్ట్రాటజీతో పాటు విమానాశ్రయానికి 15 నిమిషాల డ్రైవ్​ కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త ప్రదేశంలో ఈ-కామర్స్ దిగ్గజం వరల్డ్ ట్రేడ్ సెంటర్​లో ఇప్పటి వరకు ఉన్న దాదాపు అర మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలానికి ప్రస్తుతం చెల్లిస్తున్న చదరపు అడుగుకు రూ .250 అద్దెలో మూడింట ఒక వంతు కంటే తక్కువ చెల్లిస్తుంది!

లాక్​డౌన్​ ఎత్తివేత తర్వాత టెక్ ఉత్పత్తుల వాడకం తగ్గడంతో అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. మహమ్మారికి ముందు వడ్డీ రేట్లు తక్కువగా ఉండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.

ఈ తరలింపు 2025 ఏప్రిల్​లో ప్రారంభమై 2026 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని నివేదిక తెలిపింది.

అమెజాన్ ప్రస్తుత కార్యాలయం 40 ఎకరాల సముదాయంలో 1,200 రెసిడెన్షియల్ ప్లాట్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఫైవ్ స్టార్ హోటల్, ఆసుపత్రి, పాఠశాలతో పాటు క్లబ్, జాగింగ్ ట్రాక్ వంటి ఇతర సౌకర్యాలను కలిగి ఉంది.

ఈ కారణంగా, 5,000 మంది అమెజాన్ ఉద్యోగుల్లో చాలా మంది సమీపంలో నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడి ప్లాట్స్​లోని నాలుగింట ఒక వంతు మంది అమెజాన్​ ఉద్యోగులే ఉంటారు.

నగరం గుండా ప్రయాణించి అక్కడకు చేరుకోవడానికి పగటిపూట 80 నిమిషాలకు పైగా సమయం పడుతుంది కాబట్టి 20 కిలోమీటర్ల దూరంలోని కొత్త కార్యాలయానికి వెళ్లాలని కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"ఇది సురక్షితమైన, నిశ్శబ్దమైన ప్రాంతం, మా పిల్లల కోసం పాఠశాలలు, మాల్, భోజన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి," అని అమెజాన్​లో ఆరేళ్లుగా ఉన్న ఒక ఎగ్జిక్యూటిన్​ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఇక్కడ నుంతి డ్రైవింగ్ చేయడం కుదరదు కాబట్టి ఆఫీసుకు దగ్గరలో ఉన్న మరో ఇంటిని చూడాల్సి ఉంటుంది," అని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు సత్వా గ్రూప్​ నిర్మించిన భవనంలోకి హెడ్​క్వార్టర్స్​ని షిఫ్ట్​ చేయాలని అమెజాన్​ ఇండియా భావిస్తోంది.

ఆఫీస్​ను తరలించే విషయంలో అమెజాన్ ఒక్కటే కాదు.. బోయింగ్, ఇన్ఫోసిస్, ఫాక్స్​కాన్​ కూడా బెంగళూరు ఎయిర్​పోర్ట్​ కారిడార్​లో భూములను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇది ఇప్పటికీ మెట్రో రైలు ద్వారా అనుసంధానించలేదు. కానీ పరిస్థితి త్వరలో మారవచ్చు.

ప్రస్తుతం అమెజాన్​ ఖాళీ చేస్తున్న భవనం ప్రముఖ, లిస్టెడ్​ రియల్​ ఎస్టేట్​ డెవలర్​ బ్రిగేడ్​ ఎంటర్​ప్రైజజెస్​ లిమిటెడ్​కి చెందినది. మరి అమెజాన్​ స్థానంలో ఎవరు ఈ కార్యలయంలోకి వస్తారు? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నంగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం