Amazon, Flipkart Sales: ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ సేల్స్ నేడే ఆఖరు.. ఆఫర్లపై ఓ లుక్కేయండి-amazon great republic day sale flipkart big saving days sale last day today check offers discounts deals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Amazon Great Republic Day Sale Flipkart Big Saving Days Sale Last Day Today Check Offers Discounts Deals

Amazon, Flipkart Sales: ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ సేల్స్ నేడే ఆఖరు.. ఆఫర్లపై ఓ లుక్కేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2023 11:19 AM IST

Amazon, Flipkart Sales: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale), ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) సేల్ నేటితో ముగియనున్నాయి. ఆ వివరాలు ఇవే..

Amazon, Flipkart Sales: ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ సేల్స్ నేడే ఆఖరు
Amazon, Flipkart Sales: ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ సేల్స్ నేడే ఆఖరు (REUTERS)

Amazon, Flipkart Sales: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) తీసుకొచ్చిన సేల్స్ నేటి (జనవరి 20, శుక్రవారం)తో ముగియననున్నాయి. అమెజాన్‍లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day sale)నేటి అర్ధరాత్రితో అయిపోనుంది. ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) కూడా ముగియనుంది. ప్రస్తుతం ఈ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లు (Smartphones), స్మార్ట్ టీవీలు (Smart TVs), ట్యాబ్‍లు, స్మార్ట్ వాచ్‍లు, ల్యాప్‍టాప్‍లు, ఇయర్‌బడ్స్ సహా చాలా ప్రొడక్టులపై ఆఫర్లను ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Amazon Sale, Flipkart Sale Bank Card Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‍లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులపై ఆఫర్ ఉంది. ఈ కార్డుతో ప్రొడక్టులను కొంటే 10శాతం వరకు అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఇక ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‍లో ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, సిటీ (CITI) బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు చేస్తే 10శాతం ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‍లపై..

Amazon Sale, Flipkart Sale Mobile offers: అమెజాన్‍లో ఐకూ నియో 6 5జీ, ఐకూ జెడ్ 6 ప్రో, ఐకూ జెడ్6 లైట్ 5జీ, రియల్‍మీ 50ప్రో 5జీ, వన్‍ప్లస్ నార్డ్ 2టీ 5జీ, ఐకూ 9 ఎస్ఈ 5జీ, వన్‍ప్లస్ 10 ప్రో 5జీ, వన్‍ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్‍ప్లస్ 10ఆర్ 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్‍మీ నార్జో 50 5జీ, రెడ్‍మీ కే50 ఐ5జీ ఫోన్లు మంచి డిస్కౌంట్‍తో (Smartphone Discounts) అందుబాటులో ఉన్నాయి. మిలిగిన మోడళ్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో రియల్‍మీ జీటీ నియో 3 5జీ, రియల్‍మీ 9ప్రో+ 5జీ, పోకో ఎక్స్4 ప్రో 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 6ఏ, మోటోరోలా ఎడ్జ్ 30, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, షావోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ మొబైళ్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్‍తో అందుబాటులో ఉన్నాయి. అలాగే మిగిలిన మొబైళ్లు కూడా ఆఫర్లతో లభిస్తున్నాయి.

వీటిపై కూడా..

Amazon Sale, Flipkart Sale: స్మార్ట్ టీవీలపై కూడా ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్‍లో ఆఫర్లు ఉన్నాయి. దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్‍తో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. షావోమీ, సామ్‍సంగ్, ఎల్‍జీ, వన్‍ప్లస్, రియల్‍మీ, సోనీ, హైసెన్స్ సహా అన్ని కంపెనీల టీవీలపై ప్రస్తుతం ఈ సేల్స్‌లో ఆఫర్లు లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లను వినియోగించుకుంటే మరింత తక్కువకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని కంపెనీల 4కే స్మార్ట్ టీవీలను రూ.25,000 ధరకే సొంతం చేసుకునే ఛాన్స్ కూడా లభిస్తోంది.

ఈ సేల్స్‌లో ల్యాప్‍టాప్‍లపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక స్మార్ట్ వాచ్‍లు, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు కూడా 70 శాతం వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. నేటితో (జనవరి 20) ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డేస్ సేల్స్ ముగియనున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం