Mutual funds investment : ఇది తెలుసుకోకపోతే.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో నష్టపోతారు!
Mutual funds investments in India : మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులకు ముందు.. చాలా మంది 'రిటర్నులు' ఒక్కటే చూస్తారు. కానీ చూడాల్సిన అంశాలు ఇంకొన్ని కూడా ఉన్నాయి. అవి తెలియకపోతే.. నష్టాలు తప్పవు! అవేంటంటే..

Mutual Fund Fees and Charges in India : నూతన ఏడాది రిసొల్యూషన్లో భాగంగా.. ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభిద్దామని చూస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు ఇస్తాయని విన్నారా? మంచి మ్యూచువల్ ఫండ్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మంచి మ్యూచువల్ ఫండ్‌ను వెతికి, అందులో ఇన్వెస్ట్ చేస్తే మీ పని ముగిసినట్టు కాదు. సాధారణంగా.. ఒక మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్నులు ఇచ్చిందనే విషయాన్ని చూడటం ఎంత అవసరమో.. సంబంధిత ఫండ్ 'ఖర్చులు' ఎంత ఉన్నాయన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఈ క్రమంలో.. ఇండియాలోని మ్యూచువల్ ఫండ్స్ వేసే ఛార్జీలు, మనకి అదనంగా అయ్యే ఖర్చుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎంట్రీ లోడ్..
Mutual Fund entry load : మ్యూచువల్ ఫండ్ ఖర్చుల్లో ముందుగా వినిపించే మాట ఈ ఎంట్రీ లోడ్. మొదటి సారి సంబంధిత స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. గతంలో ఈ ఎంట్రీ లోడ్ పడేది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను ప్రమోట్ చేయడం కోసం.. సంబంధిత సంస్థ చేసిన ఖర్చులను ఈ ఎంట్రీ లోడ్‌తో రికవరీ చేస్తాయి.
2009కి ముందు.. ఇండియాలోని ఒక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. ఒక్కో విధంగా ఈ ఎంట్రీ లోడ్‌ను విధించేది. అత్యధికంగా 2.5శాతం వరకు ఎంట్రీ లోడ్ ఉండేది. అయితే.. 2009 తర్వాత సెబీ నిబంధనలు అమల్లోకి రావడంతో ఇప్పుడు.. ఎంట్రీ లోడ్ అనేది పూర్తిగా మాయమైపోయింది! మ్యూచువల్ ఫండ్ హౌజ్‌లు కస్టమర్లపై ఎంట్రీ లోడ్ భారాన్ని వేయకూడని సెబీ స్పష్టం చేసింది.
2023 Investment tips : ఈ ఏడాది పాటించాల్సిన కొన్ని ఇన్వెస్ట్మెంట్ టిప్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎగ్జిట్ లోడ్..
What is exit load in mutual fund : మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేసిన కొంత టైమ్ పీరియడ్‌కు.. దానిని ఉపసంహరించుకుంటే.. ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఇది ఫండ్ హౌజ్‌కు ఒకింత లాభాన్ని కలిగించేదే! టైమ్ పీరియడ్‌పై ఉన్న ఎగ్జిట్ లోడ్‌ను చూసుకుని ఫండ్‌ను ఉపసంహరించుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. సాధారణంగా.. రిడెంప్షన్ వాల్యూపై 1శాతం వరకు ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తాయి మ్యూచువల్ ఫండ్స్. ఏడాది టైమ్ పీరియడ్లోపు రిడీమ్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఏడాది తర్వాత ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.
ట్రాన్సాక్షన్ ఛార్జీలు..
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో కేవలం ఒక్కసారే ఈ ట్రాన్సాక్షన్ ఛార్జీలు పడతాయి. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రూ. 10వేలు అంతకన్నా ఎక్కువ ఉంటే.. రూ. 100 లేదా రూ. 150 ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. సిప్‌లో కూడా రూ. 10వేల పెట్టుబడి దాటితే ఈ ఛార్జీలు వసులు చేస్తారు. రూ. 10వేలలోపు పెట్టుబడులకు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి ముందు తెలుసుకోవాల్సిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎక్స్పెన్స్ రేషియో..
What is expense ratio in Mutual Fund : ఎక్స్పెన్స్ రేషియోను.. మ్యూచువల్ ఫండ్ ఫీజు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియో అంటే.. మన డబ్బులను మేనేజ్ చేస్తున్నందుకు ఫండ్ హౌజ్‌కు తీసుకునే ఫీజు. ఇది పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది. ఇదొక యాన్యువల్ ఫీజు. సేల్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మనిస్ట్రేషన్ ఫీజు, డిస్ట్రిబ్యూషన్ ఫీజు, ఫండ్ మేనేజర్ ఫీజు తదితర ఛార్జీలన్నీ ఇందులోనే ఉంటాయి.
సంబంధిత ఫండ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నందుకు.. ఫండ్ హౌజ్‌కు అవుతున్న ఖర్చును.. ఫండ్ ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్)తో విభజించి.. ఈ ఎక్స్పెన్స్ రేషియోను నిర్ణయిస్తారు.
Mutual Fund SIP : ‘స్మాల్ క్యాప్’ మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో చేయకూడని తప్పుల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ను చూసుకుంటే.. దీర్ఘకాలంలో ఛార్జీల భారం తక్కువగా ఉంటుంది. అయితే.. రెగ్యులర్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. డైరక్ట్ ప్లాన్‌లో తక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుందనేది తెలుసుకోవడానికి.. అసలు రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి? డైరక్ట్ ప్లాన్ అంటే ఏంటి? అన్న ప్రశ్నలకు స్పష్టత రావాలి.
రెగ్యులర్ ప్లాన్.. డైరక్టర్ ప్లాన్..
What is Direct plan in Mutual fund : రెగ్యులర్ ప్లాన్ అంటే.. మీరు ఓ మధ్యవర్తి ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మధ్యవర్తి అంటే.. డిస్ట్రిబ్యూటర్ అవ్వొచ్చు, బ్రోకర్ అవ్వొచ్చు లేదా ఏజెంట్ కూడా అవ్వొచ్చు. సంబంధిత మధ్యవర్తులకు.. ఫండ్ హౌజ్ కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే.. రెగ్యులర్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది.
డైరక్ట్ ప్లాన్‌లో.. ఎలాంటి మధ్యవర్తి ఉండరు. మీకు- ఫండ్ హౌజ్‌కు మధ్య డైరక్ట్ లింక్ ఉంటుంది. ఫలితంగా డైరక్ట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది.
సంబంధిత కథనం