Royal Enfield Interceptor Bear 650 : ఇంటర్‌సెప్టర్ బేర్ 650.. లాంచ్‌కు సిద్ధం!
Royal Enfield Interceptor Bear 650 : రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
Royal Enfield Interceptor Bear 650 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‍ఫీల్డ్.. 650 సీసీ లైనప్‌లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. దాని పేరు.. రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650! ఈ బైక్‌కు సంబంధించిన టెస్ట్ మాడ్యూల్‌ను ఇటీవలే స్పాట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Royal Enfield Interceptor Bear 650 launch : రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫ్రెంట్ డిజైన్.. ఇంటర్‌సెప్టర్ 650ని పోలి ఉండొచ్చు. టియర్‌డ్రాప్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, వైడ్ హ్యాండిల్‌బార్, రిబ్డ్ పాటర్న్ సీట్, గ్రాబ్ రెయిల్స్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, సర్క్యులర్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి ఉండే అవకాశం ఉంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వయర్ స్పోక్డ్ వీల్స్ సైతం ఉండొచ్చు.
రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650- ఇంజిన్..
ఈ బైక్‌లో 648సీసీ ప్యారెలల్ ట్విన్ ఇంజిన్ ఉండనుంది. ఇదొక ఓబీడీ-2 కంప్లైంట్ అవుతుంది. ఇంటర్‌సెప్టర్ 650లోనూ ఇదే ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 47 హెచ్‌పీ పవర్‌ను, 52ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఇందులో ఉండొచ్చు.
ఇదీ చూడండి:- Royal Enfield Bullet 350 vs Classic 350: ఈ రెండు రాయల్ ఎన్‍ఫీల్డ్ బైక్‍ల మధ్య తేడాలేంటి? ఏది ఎలా ఉంది?
రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650- సేఫ్టీ ఫీచర్స్..
ఈ బైక్‌లో ఫ్రెంట్- రేర్‌లో డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటివి వస్తాయి. ఫలితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది.
Royal Enfield Interceptor Bear 650 price : ఇక సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో ఇన్వర్టెడ్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్ యూనిట్లు ఉండనున్నాయి.
రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650- ధర..
రాయల్ ఎన్‍ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 లాంచ్, ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా ఈ మోడల్ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక దీని ఎక్స్‌షోరూం ప్రైజ్ రూ. 3.5లక్షలుగా ఉండొచ్చు!
సంబంధిత కథనం