Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​లో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఇదే..-all you need to know about tata nexon creative plus ps value for money variant ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​లో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఇదే..

Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​లో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

Tata Nexon value for money variant : టాటా నెక్సాన్​ ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఉన్న ఆప్షన్స్​లో టాటా నెక్సాన్​ క్రియేటివ్​ + పీఎస్​ని వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​గా చూస్తున్నారు. ఎందుకు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్​ ఎస్​యూవీ..

ఇండియన్​ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లోని బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో టాటా నెక్సాన్​ ముందు వరుసలో ఉంటుంది.​ నెక్సాన్ శ్రేణి 2023లో కొత్త డిజైన్, ఫీచర్లతో పూర్తిస్థాయిలో అప్డేట్​ అయ్యింది. ఇక 2025లోనూ నెక్సాన్ లైనప్ చిన్న ఫీచర్ చేర్పులు, కొత్త కలర్ ఆప్షన్స్​తో మరొక మైనర్​ అప్డేట్​ని అందుకుంది. 2025 టాటా నెక్సాన్ ప్రారంభ ధర ఇప్పుడు రూ .7.99 లక్షల నుంచి రూ .14.79 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. అయితే టాటా నెక్సాన్​ క్రియేటివ్​ + పీఎస్​ వేరియంట్​.. ఒక వాల్యూ బైగా మార్కెట్​లో చూస్తున్నారు. ఇది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఎందుకో ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్ క్రియేటివ్ + పీఎస్: ధర..

టాటా నెక్సాన్ ఎస్​యూవీ లైనప్ స్మార్ట్ ట్రిమ్ స్థాయిలతో ప్రారంభమై ఫియర్లెస్ + డీటీ ట్రిమ్ స్థాయి వరకు వెళుతుంది. క్రియేటివ్ ప్లస్ పీఎస్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్ ప్రారంభ ధర రూ .12.30 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్ ధర రూ.13.50 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

క్రియేటివ్ + పీఎస్ వేరియంట్ డీజిల్ శ్రేణి మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ రూ .13.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఏఎంటీ ఆప్షన్​ రూ .14.40 లక్షల వరకు ఉంటుంది. ఈ వేరియంట్ సీఎన్జీ ఆప్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .13.29 లక్షలు.

టాటా నెక్సాన్ క్రియేటివ్ + పీఎస్: ఫీచర్లు..

ఈ టాటా నెక్సాన్ ఎస్​యూవీలో క్రియేటివ్ + పీఎస్ వేరియంట్ సౌలభ్యం, భద్రత, సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో అనేక ఫీచర్లను కలిగి ఉంది. బై-ఎల్ఈడీ ఆటోమేటిక్ హెడ్​లైట్స్, కార్నరింగ్ ఫంక్షన్​తో ఫ్రెంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫుల్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, 16 ఇంచ్​ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఈ క్యాబిన్​లో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

పానోరమిక్ సన్​రూఫ్, వైర్​లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, యూఎస్​బీ ఏ, సీ ఛార్జింగ్ పోర్టులు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్​తో కూడిన పాసివ్ ఎంట్రీ, రేర్ వైపర్ అండ్ వాషర్, రేర్ డీఫాగర్, కప్ హోల్డర్​తో కూడిన రేర్ సీట్ ఆర్మ్ రెస్ట్, పార్శిల్ ట్రే, 60:40 స్ప్లిట్ రేర్ సీట్లు ఈ ఎస్​యూవీలో ఉన్నాయి.

భద్రత పరంగా ఇది 6 ఎయిర్ బ్యాగులతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా సూట్ వంటి ఫీచర్స్​తో వస్తోంది.

టాటా నెక్సాన్ క్రియేటివ్ + పిఎస్: స్పెసిఫికేషన్లు..

టాటా నెక్సాన్ క్రియేటివ్ + పీఎస్ వేరియంట్ వివిధ డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా మూడు విభిన్న ఇంజిన్​ ఆప్షన్స్​లో లభిస్తుంది. మొదటిది 1.2-లీటర్ 3 సిలిండర్​ టర్బోఛార్జ్డ్ రెవోట్రాన్ ఇంజిన్. ఇది 86.7 బీహెచ్​పీ పవర్​, 170 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) ట్రాన్స్​మిషన్​తో లభిస్తుంది.

రెండొవది 1.5-లీటర్ 4 సిలిండర్​ టర్బోఛార్జ్డ్ ఇంజిన్. ఇది 83 బీహెచ్​పీ పవర్​, 260 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఏఎంటీ లేదా 6-స్పీడ్ మాన్యువల్​తో వస్తుంది. ఇక 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ రెవోట్రాన్ ఇంజిన్ సీఎన్జీ ఇంధనం కోసం ట్యూన్ చేయడం జరిగింది. ఇది 72.5 బీహెచ్​పీ పవర్​, 170 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆప్షన్లు పనితీరు, సామర్థ్యం మధ్య సమతుల్యతను అందిస్తాయి! విభిన్న వినియోగదారు ప్రాధాన్యతలను తీరుస్తాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం