Kia PV5 : కుటుంబం మొత్తానికి సరిపోయే కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​.. సూపర్​ డిజైన్​తో!-all you need to know about kia pv5 a mid range electric van ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Pv5 : కుటుంబం మొత్తానికి సరిపోయే కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​.. సూపర్​ డిజైన్​తో!

Kia PV5 : కుటుంబం మొత్తానికి సరిపోయే కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​.. సూపర్​ డిజైన్​తో!

Sharath Chitturi HT Telugu
Published Jul 13, 2024 11:15 AM IST

కియా తన కొత్త మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వ్యాన్​ను త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి కియా పీవీ5 అని పేరు పెట్టింది. ఈ ఎలక్ట్రిక్​ వ్యాన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​ కాన్సెప్ట్​
కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​ కాన్సెప్ట్​

ప్రపంచ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై పట్టు సాధించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న కియా మోటార్స్​, సరికొత్త ప్రాడక్ట్స్​ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఒక మిడ్​ సైజ్​ ఎలక్ట్రిక్​ వ్యాసింజర్​ వ్యాన్​ని సంస్థ రెడీ చేస్తోంది. దీని పేరు కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​. ఈ కియా పీవీ5.. 2025 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అవుతుందని సమాచారం. కాగా ఈ మోడల్​కి సంబంధించి టెస్టింగ్​ ప్రక్రియ ఇప్పటికే విదేశాల్లో జరుగుతోంది. కుటుంబం మొత్తానికి సరిపోయే విధంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్​ వ్యాన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా పీవీ5- అన్ని అవసరాల కోసం ఒకే ఎలక్ట్రిక్​ వ్యాన్​!

జనవరిలో జరిగిన సీఈఎస్ 2024లో తొలిసారి ఈ పీవీ5 కాన్సెప్ట్​ వర్షెన్​ని కియా మోటార్స్​ ప్రదర్శించింది. కియా పీవీ1, పీవీ7ని కూడా ప్రదర్శించింది. ఇక కియా పీవీ5ని మిడ్ సైజ్ మోడల్​గా రూపొందిస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. నగరంలో ప్యాసింజర్ వాహనాలు, కార్గో డెలివరీలో దీనిని ఉపయోగించుకోవచ్చు!

కియా పీవీ5 ఇంటీరియర్​..!
కియా పీవీ5 ఇంటీరియర్​..!

 ఈ పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​తో వినియోగదారులు మూడు ఆప్షన్స్​ని ఇస్తోంది సంస్థ. వారి అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగరేషన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. బేసిక్ ఫర్ ప్యాసింజర్ సర్వీస్, వ్యాన్ ఫర్ డెలివరీ, ఛాసిస్ క్యాబ్ వంటి మోడళ్లలో దీన్ని తీసుకురానుంది. ఇది కాకుండా, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని పొందే పివి 5 రోబోటిక్ నమూనాను అభివృద్ధి చేసే పనిలో కూడా కియా ఉంది.

కాన్సెప్ట్ తో పోలిస్తే దీని ఫైనల్ మోడల్​లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇందులో బ్లాక్ స్టీల్ వీల్స్, ట్రెడీషనల్​ గ్లాసెస్​ ఉంటాయి. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్​ వ్యాన్​కు వీల్ ఆర్చ్​లు, క్లాడింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, జర్మనీలో వెహికిల్​ టెస్ట్​ డ్రైవ్​ నేపథ్యంలో బయటపడ్డాయి. వివిధ ఆప్షన్స్​ కోసం కావాల్సిన ఫ్లెక్సిబిలిటీని స్వాపెబుల్ అప్పర్ బాడీ మాడ్యూల్​తో అందిస్తారు. ఇది కిట్​గా అందుబాటులోకి వస్తుంది. మెకానికల్ కప్లింగ్స్, ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫిక్సర్ పాయింట్లను ఉపయోగించి ఈ కిట్లను కనెక్ట్ చేయవచ్చు. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు.

కియా పీవీ5ని ఈ-సీసీపీఎం (ఎలక్ట్రిక్ కంప్లీట్ ఛాసిస్ ప్లాట్ఫామ్ మాడ్యూల్) ప్లాట్ఫామ్​పై నిర్మింస్తోంది సంస్థ. అయితే దాని ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సంస్థ కూడా ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. పీవీ1, పీవ7 మధ్యలో ఈ పీవీ5 పొజీషనింగ్​ ఉంటుంది. దక్షిణ కొరియాలోని కొత్త ప్రొడక్షన్ యూనిట్​లో దీనిని తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్లాంట్​ వార్షిక సామర్థ్యం 1.5 లక్షల యూనిట్లు.

ఈ కియా పీవీ5 ఎలక్ట్రిక్​ వ్యాన్​ లాంచ్​ డేట్​, ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. 2025 లాంచ్​ టైమ్​లోపు అన్ని వివరాలపై స్పష్టత వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం