Lava Yuva Pro । సరసమైన ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇలా ఉన్నాయి!-all new lava yuva pro smartphone launched at affordable price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  All New Lava Yuva Pro Smartphone Launched At Affordable Price

Lava Yuva Pro । సరసమైన ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు ఇలా ఉన్నాయి!

HT Telugu Desk HT Telugu
Oct 11, 2022 03:48 PM IST

లావా నుంచి సరికొత్త Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈ ఫోన్ కేవలం రూ. 8 వేల బడ్జెట్ ధరలో లభించనుంది, ఫీచర్లు చూడండి.

Lava Yuva Pro
Lava Yuva Pro

భారతీయ కంపెనీ లావా, నిశ్శబ్దంగా 'యువ' అనే పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తాజాగా Lava Yuva Pro అనే ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ ప్యానెల్ పాలికార్బోనేట్ షెల్‌తో, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. ఇది ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ కాబట్టి ఆ ప్రకారంగా ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ మీకు రూ. 8 వేల లోపు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అయినప్పటికీ ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, HD+ రెసల్యూషన్ కలిగిన వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ ఉన్నాయి. ఈ హ్యాండ్‌‌సెట్‌లో ఇచ్చిన 5000 mAh బ్యాటరీ 37 గంటల టాక్ టైమ్, 320 గంటల స్టాండ్‌బైని అందించగలదని లావా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న ఏకైక ఏకైక కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. అయితే మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని 512GB వరకు విస్తరించుకోవచ్చు.

ఈ ఫోన్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా Lava Yuva Pro ఫీచర్ల జాబితాలో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఇక్కడ పరిశీలించండి.

Lava Yuva Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.51 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ ప్రాసెసర్
  • వెనకవైపు 13MP కెమెరా+ 2 ఆక్సిలరీ లెన్స్‌లు, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

అదనంగా.. USB-C పోర్ట్, డ్యూయల్ సిమ్, 4G VoLTE, WiFi, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Lava Yuva Pro ధర రూ.7,799/- . లావా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఇదే రేంజ్ ధరలో Redmi A1, Tecno Spark 9, Realme C30s వంటి స్మార్ట్‌ఫోన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం