మచ్ అవైటెడ్ క్విడ్ ఈవీని అధికారికంగా ఆవిష్కరించింది ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్. క్విడ్ ఇ-టెక్ పేరుతో ఇది బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త మోడల్ డాసియా స్ప్రింగ్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారుకు ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైంది. రెనాల్ట్ సంస్థ విద్యుత్ వాహనాల వ్యూహంలో ఇది కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ క్విడ్ ఈవీకి సంబంధించిన టెస్ట్ వెహికిల్స్ భారత రోడ్లపై ఇప్పటికే చాలాసార్లు కనిపించాయి. దీని బట్టి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్‌లోకి కూడా త్వరలోనే ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది!
ఈ నేపథ్యంలో ఈ రెనాల్ట్ క్విడ్ ఈవీ రేంజ్, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
డిజైన్:
రెనాల్ట్ క్విడ్ ఈవీ డిజైన్ డాసియా ఎలక్ట్రిక్ కారు మోడల్ నుంచి స్ఫూర్తి పొందినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ముందు భాగంలో సాంప్రదాయ గ్రిల్‌కు బదులుగా క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్‌ను అమర్చారు. దీనికి వర్టికల్ ప్లేట్స్ జోడించి, కారుకు మరింత దృఢమైన రూపాన్ని ఇచ్చారు.
ప్రాజెక్టర్ హెడ్‌లైట్‌లు ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా కిందకు రిజర్వ్ చేసి ఉన్నాయి.
కారు పక్క భాగాలు పాత క్విడ్ ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉన్నాయి. దీనికి నలుపు రంగు వీల్ ఆర్చ్ క్లాడింగ్‌లు, ఓఆర్వీఎంలలో అమర్చిన ఇండికేటర్ లైట్లు, బ్లాక్ సైడ్ క్లాడింగ్, 14-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి.
వెనుక భాగంలో వై- ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్), హాలోజెన్-ఆధారిత రివర్స్ లైట్లు ఉన్నాయి.
క్విడ్ ఈవీ లోపలి భాగం రిఫ్రెష్‌గా, అత్యాధునిక టెక్నాలజీతో కనిపిస్తోంది. కొత్తగా డిజైన్ చేసిన క్యాబిన్‌లో 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
అదనంగా, 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు యూఎస్‌బీ-సీ పోర్టులు, ఎత్తు సర్దుబాటు చేసుకునే స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత (సేఫ్టీ):
భద్రత విషయంలో రాజీ లేకుండా, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్-స్టార్ట్ అసిస్ట్, రేర్ కెమెరా, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), సీట్‌బెల్ట్ రిమైండర్, ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ (ISOFIX) వంటి కీలక భద్రతా ఫీచర్లను చేర్చారు.
క్విడ్ ఇ-టెక్గా పేరొందిన రెనాల్ట్ క్విడ్ ఈవీలో 26.8 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని సంస్థ జోడించింది. ఒకే ఛార్జ్‌పై ఇది గరిష్టంగా 250 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటారు సుమారుగా 65 హెచ్‌పీ (హార్స్ పవర్) వరకు గరిష్ట పవర్‌ని ఉత్పత్తి చేయగలదు.
బ్రెజిల్లో ఈ రెనాల్ట్ క్విడ్ ఇ-టెక్ ధర 99,000 బ్రెజీలియన్ రియల్. అంటే సుమారు రూ. 16.6 లక్షలు!
ఇక భారత్‌లో లాంచ్ అయిన తర్వాత, రెనాల్ట్ క్విడ్ ఈవీ అనేది టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
కాగా ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియా లాంచ్‌పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం