మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి తొందరగా బయటపడాలంటే మీ ఇన్వెస్ట్​మెంట్స్​లో ఈ ఒక్క మార్పు చేయండి..-all about mid cap mutual funds investment tips and its benefits in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి తొందరగా బయటపడాలంటే మీ ఇన్వెస్ట్​మెంట్స్​లో ఈ ఒక్క మార్పు చేయండి..

మిడిల్​ క్లాస్​ ‘ట్రాప్​’ నుంచి తొందరగా బయటపడాలంటే మీ ఇన్వెస్ట్​మెంట్స్​లో ఈ ఒక్క మార్పు చేయండి..

Sharath Chitturi HT Telugu
Dec 09, 2024 12:21 PM IST

Mid cap mutual funds : కొత్తగా ఒక మ్యూచువల్​ ఫండ్​ తీసుకోవాలని చూస్తున్నారా? మరి మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి మీకు తెలుసా?

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి మీకు తెలుసా?
మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గురించి మీకు తెలుసా?

తక్కువ రిస్క్​తో ఎక్కువ లాభాలు పొందాలని ఇన్వెస్టర్లు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా మిడిల్​ క్లాస్​ వారు పెద్దగా రిస్క్​ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. వీరు సాధారణంగా లో- రిస్క్​ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేస్తుంటారు. అయితే, కాస్త మైండ్​సెట్​ని మార్చుకుని ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్​ఫోలియోలో చిన్న మార్పు చేసుకుంటే.. మనం వేగంగా కోటీశ్వరులు అవ్వొచ్చు. అందుకే ఉపయోగపడేదే ‘మిడ్​ క్యాప్ మ్యూచువల్​ ఫండ్స్​​’! అసలు ఏంటి ఈ మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​? దీనితో ప్రయోజనాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ అంటే?

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ అర్థం దాని పేరులోనే ఉంది! మిడ్​ క్యాప్​ సంస్థల్లో ఇన్​వెస్ట్​మెంట్​ని ఇది సూచిస్తుంది. మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్​ క్యాప్​లుగా పిలుస్తుంటారు. ఈ ర్యాంకింగ్స్​ని స్టాక్​ మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ డిసైడ్​ చేస్తుంది.

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ మధ్యలో ఉంటాయి. ఇవి మదుపర్లకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కాస్త రిస్క్​తో, ఎక్కువ రిటర్నులు ఇస్తాయి. అటు స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​తో పోల్చుకుంటే.. మిడ్​ క్యాప్ ఫండ్స్​ నిలకడగా, తక్కువ రిస్క్​తో ఉంటాయి. అందుకే..మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో మంచి రిస్క్​తో మంచి రివార్డు లభిస్తుందనడంలో సందేహం లేదు.

సాధారణంగా ఇండెక్స్​ ఫండ్స్​ దీర్ఘకాలంలో 12శాతం రిటర్నులు ఇస్తాయి. కానీ మిడ్​ క్యాప్​ ఫండ్స్​ 12శాతం కన్నా అధికంగా రిటర్నులు ఇస్తుంటాయి. దీర్ఘకాలంలో రిటర్నులు సగటు 18శాతం నుంచి 20శాతం మధ్యలో ఉండొచ్చు. దీనిని మనం మన ప్రయోజనాలకు ఉపయోగించుకుని ఇన్వెస్ట్​ చేయాలి.

ఉదాహరణకు.. ఇండెక్స్​ ఫండ్స్​లో 26ఏళ్ల పాటు ప్రతి నెల రూ. 5వేలు ఇన్వెస్ట్​ చేస్తూ వెళితే (12శాతం రిటర్న్​) పెట్టుబడి విలువ రూ. 1కోటి మార్క్​ టచ్​ అవుతుంది. అదే మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో అయితే 20ఏళ్ల (18శాతం రిటర్న్​) సమయం మాత్రమే పడుతుంది.

ఇలా ఇన్వెస్ట్​ చేయండి..

ఎంత కాదనుకున్న, మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ రిస్క్​తో కూడుకున్న వ్యవహారమే. అందుకే మీరు మీ పోర్ట్​ఫోలియోని డైవర్సిఫైడ్​గా ఉంచుకోవాలి. ఇప్పటికే మీరు లో- రిస్క్​ ఇండెక్స్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేస్తున్నట్టయితే, మీ తదుపరి ఇన్వెస్ట్​మెంట్​ ఆప్షన్​ మిడ్​ క్యాప్​ అయి ఉండటం బెటర్​! అప్పుడే మీకు రిస్క్​ మేనేజ్​ అయ్య అవకాశం ఉంటుంది.

పైగా ఏదైనా మ్యూచువల్​ ఫండ్​లో కనీసం 10ఏళ్ల పాటు ఇన్వెస్ట్​ చేయాలి. అప్పుడే దాని రిజల్ట్​ మనకి కనిపిస్తుంది.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకునేటప్పుడు రిస్క్​తో పాటు మీ ఫైనాన్షియల్​ గోల్స్​ని దృష్టిలో పెట్టుకోవాలి. తొందరపడి ఏదో ఒకటి ఎంచుకుంటే.. దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వయస్సు కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు యంగ్​ ఏజ్​లో ఉంటే రిస్క్​ తీసుకోవచ్చు. అదే రిటైర్మెంట్​కు సమీపిస్తున్నప్పుడు రిస్క్​ తీసుకోవడం మంచిది కాదు.

చివరిగా ఒక్క విషయం.. నిన్నటి మిడ్​ క్యాప్​ కంపెనీలే, నేటి లార్జ్​ క్యాప్​ సంస్థలు! మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​తో సంపద సృష్టికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం!

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం