Alibaba founder Jack Ma whereabouts: జాక్ మా ఆచూకీ తెలిసింది..-alibaba founder jack ma is living in tokyo now report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Alibaba Founder Jack Ma Is Living In Tokyo Now: Report

Alibaba founder Jack Ma whereabouts: జాక్ మా ఆచూకీ తెలిసింది..

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 10:58 PM IST

Alibaba founder Jack Ma whereabouts: చైనా దిగ్గజ పారిశ్రామిక వేత్త, చైనా ప్రభుత్వంతో విబేధాల అనంతరం దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిన జాక్ మా ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలిసింది.

అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా
అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా (REUTERS/File)

Alibaba founder Jack Ma whereabouts: చైనా వ్యాపార రంగంలో జాక్ మా ది స్పూర్తి దాయక గాధ. జీరో నుంచి ప్రారంభించి బిలియనీర్ గా ఎదిగారు. ఈ కామర్స్ సంస్థ ‘అలీబాబా’ ను ప్రారంభించి అనూహ్య ఎత్తులకు తీసుకువెళ్లారు. అయతే, చైనా ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయన వ్యాపారాలపై చైనా ప్రభుత్వం నజర్ పెట్టింది. దాంతో దాదాపు 2020 నుంచి ఆయన చైనాలో ఉండడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Alibaba founder Jack Ma whereabouts: జపాన్ లో..

స్థానిక మీడియా సమాచారం మేరకు.. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ లో ఉంటున్నట్లు సమాచారం. కుటుంబంతో కలిసి జపాన్ లోనే జాక్ మా ఉంటున్నారు. జపాన్ గ్రామీణ ప్రాంతాల్లోని హాట్ స్ప్రింగ్స్, స్కై రిసార్ట్ లకు కుటుంబంతో కలిసి వెళ్లారు. జపాన్ నుంచే సింగపూర్, బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లివచ్చారు. స్పెయిన్, నెదర్లాండ్స్ లోనూ ఆయన కనిపించారు.

Alibaba founder Jack Ma whereabouts: విమర్శలతో సమస్యలు ప్రారంభం

చైనాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను వాటి పని తీరుపై జాక్ మా 2020లో ఘాటు విమర్శలు చేశారు. వాటి పనితీరు వడ్డీ వ్యాపారుల మాదిరిగా ఉందని, దేశంలోని బ్యాంకింగ్ ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని విమర్శించారు. సమర్ధులను గుర్తించి, వారికి రుణాలిచ్చే సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి నుంచి జాక్ మా సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలకు నిబంధనలు పాటించడం లేదని నియంత్రణ సంస్థలు నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓ(initial public offering) ను నిలిపేశాయి. అలాగే, ఆలీబాబాపై వచ్చిన వివిధ ఆరోపణలకు గానూ, 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి.

Alibaba founder Jack Ma whereabouts: 2015లో భారత్ కు..

చైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందు, జాక్ మా 2015లో భారత్ లో పర్యటించారు. భారత్ లో వ్యాపారాలను ప్రారంభించడానికి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. చైనాలో షాంఘైకు సమీపంలోని హాంగ్జూలో జాక్ మాకు ఇల్లు ఉంది. షాంఘైలోనే అలీబాబా ప్రధాన కార్యాలయం ఉంది. హాంకాంగ్ నుంచి వెలువడే జాక్ మా కు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఇటీవల ఒక వార్త ప్రచురించింది. చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మూడో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత.. చైనా లోని చాలా వ్యాపార సంస్థలు తమ వ్యాపార కేంద్రాలను చైనా నుంచి తరలించాలని భావిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం.

Alibaba founder Jack Ma whereabouts: రిటైర్మెంట్ ప్రకటన

పేద కుటుంబంలో జన్మించిన జాక్ మా.. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, బిలియనీర్ అయ్యారు. ఆయన ఎదుగుదల ఎంత ఆశ్చర్యాన్ని గురి చేసిందో, అకస్మాత్తుగా ఆయన చేసిన రిటైర్మెంట్ ప్రకటన కూడా అందరినీ అంతే విస్మయపరిచింది. 2019 చివర్లో జాక్ మా ఈ ప్రకటన చేశారు. ఆఫీస్ లో పని చేస్తూ చనిపోవడం కన్నా.. ఏదైనా సముద్ర ఒడ్డున బీచ్ లో చనిపోవడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని జాక్ మా అప్పుడు ప్రకటించారు. తన వ్యాపార లావాదేవీలపై చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించిన కారణంగానే జాక్ మా ఆ ప్రకటన చేశారని అంతా భావించారు. చైనాలోని ప్రముఖ వ్యాపార సామ్రాజ్యాలను కుదించడానికి అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయించుకున్నారని, చైనా ప్రజలపై వారి ప్రభావం పెరగకుండా చూడడానికి జిన్ పింగ్ ఆ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

WhatsApp channel

టాపిక్