ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో 56 రోజుల రీఛార్జ్ ప్లాన్స్.. ఇందులో తక్కువ ఏది?-airtel vodafone idea and jio 56 days recharge plans which one is the cheapest in this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో 56 రోజుల రీఛార్జ్ ప్లాన్స్.. ఇందులో తక్కువ ఏది?

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో 56 రోజుల రీఛార్జ్ ప్లాన్స్.. ఇందులో తక్కువ ఏది?

Anand Sai HT Telugu

ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియో మీకు 56 రోజుల ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే ఇందులో ఏది తక్కువ ధరలో అందుబాటులో ఉందో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం

ీరు కూడా ఎక్కువ వ్యాలిడిటీతో రోజుకు ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ అందించే మొబైల్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(విఐ) ప్లాన్లతో రీఛార్జ్ చేయవచ్చు. ఈ మూడు ప్లాన్లలో మీకు ఒకే రకమైన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ధర విషయంలో వ్యత్యాసం ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 56 రోజుల వాలిడిటీతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూద్దాం..

ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటా అంటే మొత్తం 112 జీబీ డేటాను అందిస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్స్, అపోలో 24/7 వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి వినియోగదారు రకం, ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్ అవుతుంది. ఎయిర్‌టెల్ కూడా దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందిస్తోంది.

జియో రూ.629 ప్లాన్

రిలయన్స్ జియో రూ.629 ప్రీపెయిడ్ ప్లాన్ దీర్ఘకాలిక వ్యాలిడిటీతో ప్రతిరోజూ ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారుల కోసం వస్తుంది. ఈ ప్లాన్లో 56 రోజుల పాటు రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా అంటే మొత్తం 112 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్లో లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియోక్లౌడ్ వంటి యాప్స్‌ను ఉచిత యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే 5జీ ఫోన్ కలిగి ఉంటే.. జియో 5జీ కవరేజ్ ప్రాంతంలో ఉంటే, అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.

వొడాఫోన్ ఐడియా రూ.649 ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 112జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ ప్రత్యేకత. వీఐ ప్రతి నెలా 2జీబీ డేటా బ్యాకప్‌ను కూడా అందిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.