Airtel Recharge Plans : యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్.. ఈ ప్లాన్లలో ఇకపై డేటా బెనిఫిట్స్ ఉండవు!
Airtel Removed Data Benefits : యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్ ఇచ్చింది. రెండు ప్లాన్లలో ఉన్న ఇంటర్నెట్ బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్ శాశ్వతంగా తొలగించింది. కంపెనీ డేటాను తొలగించిన రెండు ప్లాన్ల ధరలు రూ .509, రూ .1999.
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన లక్షలాది మంది కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. రెండు ప్లాన్లలో ఉన్న డేటా ప్రయోజనాలను ఎయిర్‌టెల్ తొలగించింది. అంటే ఎయిర్‌టెల్‌కు చెందిన రెండు ప్లాన్లలో మునుపటిలా ఇకపై మీకు ఇంటర్నెట్ లభించదు. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ప్రయోజనాలను తొలగించిన రెండు ప్లాన్ల లిస్టులో రూ .509, రూ .1999 ఉన్నాయి.

ఇప్పుడు మీరు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే డేటా కోసం విడిగా డబ్బు ఖర్చు చేయాలి. ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ ఇప్పుడు తన రూ .509, రూ .1999 ప్లాన్లను ఖరీదైనదిగా చేసింది. ఈ ప్లాన్లలో ఇంతకు ముందు ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రయోజనాల మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం..
ఎయిర్‌టెల్ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్లో మీకు 84 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అపోలో 24ను ఈ ప్లాన్ వస్తుంది. ఉచిత హలో ట్యూన్‌తోపాటు మరికొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎయిర్టెల్ రూ.509 ప్లాన్‌లో 6 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభించేవి.
ఎయిర్‌టెల్ రూ.1999 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్‌కు చెందిన ఈ ప్లాన్లో మీరు ఇప్పుడు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను మాత్రమే పొందుతారు. ఈ రీఛార్జ్ మొత్తం వాలిడిటీ 365 రోజులు. తక్కువ ధరకు మంచి ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది చాలా బెటర్. కానీ డేటా ప్రయోజనాలు ఉండవు. ఈ ఎయిర్‌టెల్ యూజర్లకు అపోలో 24 లభిస్తుంది. ఉచిత హలో ట్యూన్‌తోపాటుగా మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గతంలో ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లో మొత్తం 24 జీబీ డేటా లభించేది.
ఎయిర్‌టెల్ ఇతర ప్లాన్స్
మరోవైపు ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో కస్టమర్లకు 84 రోజుల వ్యాలిటిడీ ఇస్తుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు అందిస్తోంది. రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. దీనితోపాటుగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
రూ.838 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 3జీబీ డేటా అందిస్తారు. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటుగా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ మంంబర్‌షిప్ 56 రోజులపాటు వస్తుంది.