Airtel Plans: రూ.200లోపు ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్‍లు ఇవే.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే!
Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్‍లో రూ.200లోపు ప్రీపెయిడ్ ప్లాన్‍ల కోసం చూస్తున్నారా.. అయితే వాటి వివరాలు ఇవే.

Airtel Prepaid Plans Under ₹200: యూజర్ల కోసం వివిధ రేంజ్‍ల్లో విభిన్నమైన బెనిఫిట్‍లతో ప్రీపెయిడ్ ప్లాన్‍లను అందుబాటులో ఉంచింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ బడ్జెట్ రేంజ్‍లోనూ ప్రీపెయిడ్ ప్లాన్‍లు ఉన్నాయి. రూ.200లోపు కొన్ని ప్లాన్‍లు అందుబాటులో ఉన్నాయి. డేటా ఎక్కువగా అవసరం లేదనుకునే వారు, లేకపోతే సెకండ్ సిమ్‍గా వినియోగిస్తున్న వారికి ఈ ప్లాన్‍లు ఎక్కువగా సూటవుతాయి. అలా రూ.200లోపు ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‍లు ఏవో ఇక్కడ చూడండి.
ఎయిర్‌టెల్ రూ.155 ప్లాన్
ఎయిర్‌టెల్‍లో రూ.155 ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‍గా ఉంది. రూ.155 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‍లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 1జీబీ డేటా, 300 ఎస్‍ఎంఎస్‍లు లభిస్తాయి. 1జీబీ డేటా అయిపోయాక ప్రతీ ఎంబీకి 50పైసల చార్జ్ పడుతుంది.
ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‍ను ఎంపిక చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. అన్‍లిమిటెడ్ కాల్స్, మొత్తంగా 2జీబీ డేటా లభిస్తాయి. 300 ఎస్ఎంఎస్‍లు వస్తాయి.
ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లకు మొత్తంగా 3జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
ఒకవేళ బడ్జెట్ రేంజ్‍లో రోజువారీ డేటా కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.209 ప్లాన్‍ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 1జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100 ఎస్ఎస్‍ఎస్‍లు దక్కుతాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 21 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‍లతో రీచార్జ్ చేసుంటే ఉచిత హలోట్యూన్, ఫ్రీగా వింక్ మ్యూజిక్ బెనిఫిట్స్ అదనంగా దక్కుతాయి.
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ నెట్‍వర్క్‌ను ఎయిర్‌టెల్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వందలాది నగరాల్లో 5జీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ.239 అంత కంటే ఎక్కువ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 5జీ నెట్‍వర్క్‌పై అన్‍లిమిటెడ్ 5జీ డేటాను ఎయిర్‌టెల్ ఇస్తోంది. అయితే, 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో.. 5జీ నెట్‍వర్క్‌పై ఈ అన్‍లిమిటెడ్ డేటా లభిస్తుంది. కాగా, ఈ అన్‍లిమిటెడ్ 5జీ ఆఫర్‌ను మరికొంతకాలమే ఎయిర్‌టెల్ కొనసాగించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం