Airtel New Prepaid Plan: రూ.199 ప్లాన్‍ను లాంచ్ చేసిన ఎయిర్ టెల్: బెనిఫిట్స్ ఇవే
Airtel launches ₹199 Prepaid plan: రూ.199 ప్లాన్‍ను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. అన్‍లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను ఈ ప్లాన్ కలిగి ఉంది.
Airtel launches ₹199 Prepaid plan: ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‍ను లాంచ్ చేసింది. అన్‍లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్‍తో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ ధర రూ.199గా ఉంది. గత సంవత్సరం టారిఫ్ ధరలు పెంచక ముందు Airtelలో రూ.199 ప్లాన్ ఉండేది. అయితే ధరలు పెంచిన గతేడాది డిసెంబర్ సమయంలో దాన్ని తొలగించింది. ఇప్పుడు రూ.199 ప్లాన్‍ను ఎయిర్ టెల్ మళ్లీ తీసుకొచ్చింది. అయితే ఈసారి విభిన్నమైన ప్రయోజనాలను ఈ ప్లాన్‍తో ఇస్తోంది.
Airtel New Rs. 199 Plan : ఎయిర్ టెల్ కొత్త రూ.199 ప్లాన్
Airtel కొత్తగా తీసుకొచ్చిన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. అన్‍లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తంగా 3జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి. ఒకవేళ 3జీబీ అయిపోయాక ఇంటర్నెట్ వినియోగిస్తే.. ప్రతీ ఎంబీకి 50పైసలను ఎయిర్ టెల్ చార్జ్ చేస్తుంది.
రూ.199 ప్లాన్‍ను తీసుకుంటే ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ లాంటి Airtel థ్యాంక్స్ బెనిఫిట్‍లను పొందొచ్చు.
Airtel Plans with Disney+ Hotstar : డిస్నీ+ హాట్‍స్టార్ తో..
మొబైల్‍లో టీ20 ప్రపంచకప్ లైవ్ చూడాలనుకుంటున్న ఎయిర్‍టెల్ కస్టమర్ల కోసం డిస్నీ+ హాట్‍స్టార్ ఉచితంగా లభించే కొన్ని ప్లాన్‍లు అందుబాటులో ఉన్నాయి. రూ.181, రూ.399, రూ.499, రూ.599, రూ.839, రూ.2,999, రూ.3,359 ప్రీపెయిడ్ ప్లాన్‍లతో డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్‍ను ఎయిర్ టెల్ ఉచితంగా ఇస్తోంది.
ఎయిర్ టెల్ రూ.181 ప్లాన్
వీటిలో రూ.181 ప్లాన్ కాస్త భిన్నంగా ఉంది. డిస్నీ+ హాట్‍స్టార్ చాలనుకునే వారికి ఇది సూటవుతుంది. ఈ ప్లాన్ తీసుకుంటే డిస్నీ+ హాట్‍స్టార్ మొబైల్ మూడు నెలల సబ్‍స్క్రిప్షన్ లభిస్తుంది. 30 రోజుల పాటు ప్రతీ రోజు 1జీబీ డేటా దక్కుతుంది. ఈ ప్లాన్‍తో కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. ఇది డేటా యాడ్ ఆన్‍లా కూడా ఉపయోగపడుతుంది. ఇతర ప్లాన్స్ అన్నీ డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
ప్రతీ రోజు ఎక్కువ డేటా కావాలనుకునే వారు ఎయిర్ టెల్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‍ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్‍ను ఎంపిక చేసుకుంటే ప్రతీ రోజు 2.5జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎస్ఎస్‍లు దక్కుతాయి. వీటితో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ మూడు నెలల సబ్‍స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.