Airtel New Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బ్యాడ్‍న్యూస్ తప్పదా? ఇప్పటికే ఆ రెండు సర్కిళ్లలో..
Airtel New ₹155 Prepaid Plan: ఎయిర్‌టెల్ కొత్తగా రూ.155 ప్లాన్‍ను ఒడిశా, హర్యానా సర్కిళ్లలో లాంచ్ చేసింది. అయితే బేస్ ప్లాన్‍ను ఎత్తేసింది. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే.
Airtel New ₹155 Prepaid Plan: దిగ్గజ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) కొత్తగా ఓ ప్లాన్‍ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి హర్యానా, ఒడిశా సర్కిళ్లలో మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్ వాడుతున్న యూజర్లకు ఈ కొత్త ప్లాన్ ప్రతికూలంగా మారింది. రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్‍ను హర్యానా, ఒడిశాలో కొత్తగా ప్రవేశపెట్టింది ఎయిర్‌టెల్. దీన్ని తేవటంతోనే ఎంట్రీ బేస్ ప్లాన్‍గా ఉన్న రూ.99ను ఎత్తేసింది. రూ.155నే బేస్ ప్లాన్‍గా ఉంచింది. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లోనే ఈ మార్పును తీసుకొచ్చినా.. త్వరలోనే అన్ని సర్కిళ్లలో అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన రూ.155 ప్లాన్‍తో దక్కే ప్రయోజనాలు ఏంటి.. బేస్ ప్లాన్ మార్పు వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Airtel New ₹155 Plan Benefits: ఎయిర్‌టెల్ రూ.155 ప్లాన్ బెనిఫిట్స్
ఎయిర్‌టెల్ కొత్తగా హర్యానా, ఒడిశా సర్కిళ్లలో ఈ రూ.155 ప్లాన్‍ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే 1జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, 300ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
ఈ రూ.155 ప్లాన్‍ను ఆ రెండు సర్కిళ్లలో లాంచ్ చేసి.. రూ.99 బేస్ ప్లాన్‍ను ఎయిర్‌టెల్ తీసేసింది. దీంతో ఎయిర్‌టెల్ నెట్‍వర్క్ వాడాలంటే కనీసం రూ.155 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకోవాల్సిందే. అంటే బేస్ ప్లాన్ ధర సుమారు 57 శాతం పెరిగినట్టయింది. అయితే అన్‍లిమిటెడ్ కాల్స్ బెనిఫిట్ ప్రయోజనకరంగా ఉంది.
ప్రస్తుతం ఒడిశా, హర్యానా సర్కిళ్లలో రూ.99 ప్లాన్‍ను ఎయిర్‌టెల్ తొలగించింది. త్వరలోనే దేశంలోని అన్ని సర్కిళ్లలో ఇది అమలు చేసే అవకాశం ఉంది.
Airtel ₹99 Plan: ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్
ప్రస్తుతం రూ.99 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 200ఎంబీ డేటా, రూ.99 టాక్‍టైమ్ లభిస్తుంది. సెకనుకు రూ.2.5 పైసల టారిఫ్‍తో కాల్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించకుండా కేవలం సిమ్‍ను యాక్టివేట్‍లో ఉంటే చాలు అనుకునే వారికి ఇది సూటవుతోంది. అయితే రూ.155 ప్లాన్ వస్తే.. వారు కూడా దీన్నే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు.